న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రో కబడ్డీ లీగ్ ఆక్షనర్‌గా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్

Former England captain Chris Cowdrey turns Pro-Kabbadi League auctioneer

హైదరాబాద్: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ క్రిస్ కౌడ్రే ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఆక్షనర్‌గా మారారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత క్రిస్ కౌడ్రే అత్యత్తమ ఆక్షనర్లలో ఒకడిగా మారారు. దీంతో ప్రో కబడ్డీ లీగ్ 7వ సీజన్‌ కోసం నిర్వహించిన పీకేఎల్ వేలంలో ఆయన ఆక్షనర్‌గా మారారు. ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 7వ సీజన్ ఆటగాళ్ల వేలంను సోమవారం నిర్వహించారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

మొత్తం 13 దేశాలకు చెందిన 441 మంది ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొన్నారు. ఇందులో భారత్‌కు చెందిన ఆటగాళ్లు 388 కాగా, విదేశీ ఆటగాళ్లు 53 మంది ఉన్నారు. ఆటగాళ్ల వేలం కోసం ఒక్కో ప్రాంఛైజీ రూ. 4.4 కోట్లు ఖర్చు పెట్టాయి. ఇక, క్రిస్ కౌడ్రే ఎవరో కాదు కొలిన్ కౌడ్రే కొడుకు.

ఇంగ్లాండ్‌కు చెందిన కొలిన్ కౌడ్రే 1954-1974 వరకు ప్రాతినిథ్యం వహించాడు. 1968లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన కొలిన్ కౌడ్రే ఇంగ్లాండ్ తరుపున 100 టెస్టులకు ప్రాతినిథ్యం వహించాడు. ఇక, క్రిస్ కౌడ్రే విషయానికి వస్తే ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లో కెంట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.

1984-85లో భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టులో సభ్యుడు. క్రిస్ కౌడ్రే బాంబేతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. ప్రో కబడ్డీ లీగ్ 7వ సీజన్ కోసం ఇప్పటికే అన్ని ప్రాంఛైజీలు కలిపి మొత్తం 29 మంది ఆటగాళ్లను తమ వద్దే అట్టిపెట్టుకున్నాయి.

పీకీఎల్ 7వ సీజన్‌ కోసం జరిగిన వేలంలో తొలుత విదేశీ ఆటగాళ్లను ప్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ఈ వేలంలో బెంగాల్ వారియల్స్ ప్రాంఛైజీ అత్యధికంగా రూ. 77.75 లక్షలతో ఇరాన్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్‌ను కొనుగోలు చేసింది. సోమవారం నాటి వేలంలో మరో ఇరాన్ ఆటగాడు అబోజర్ మొహజేర్ మఘానిని తెలుగు టైటాన్స్ ప్రాంఛైజీ అత్యధికంగా రూ. 75 లక్షలకు సొంతం చేసుకుంది.

Story first published: Monday, April 8, 2019, 19:14 [IST]
Other articles published on Apr 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X