Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ స్పిన్నర్ షాదాబ్ జకాటి

Former CSK spinner Shadab Jakati quits all forms of cricket

హైదరాబాద్: చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ స్పిన్నర్‌ షాదాబ్ జకాటి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గోవాకు చెందిన జకాటి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌)లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ లయన్స్‌ తరఫున ఆడాడు. సీఎస్‌కే అనేక అద్భుతమైన విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

తన ట్విట్టర్‌లో "అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాను. గత ఏడాది పెద్దగా ఆడకపోయినా, ఈ నిర్ణయం నా జీవితంలో కఠినమైనది. నా కలను సాకారం చేసినందుకు బీసీసీఐ, గోవా క్రికెట్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు అండగా నిలిచిన కుటుంబసభ్యులకు, సహచరులకు, మిత్రులకు, సహాయ సిబ్బందికి ధన్యవాదాలు" అని ట్వీట్ చేశాడు.

ఎడమచేతి వాటం బౌలర్‌ అయిన షాదాబ్ జకాటి 92 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 275 వికెట్లు, 82 లిస్ట్‌-ఎ మ్యాచుల్లో 93 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో 59 మ్యాచుల్లో 47 వికెట్లు తీశాడు.

Story first published: Saturday, December 28, 2019, 11:51 [IST]
Other articles published on Dec 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+