Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Vinod Kambli : ఇళ్లు గడవడానికి ఇబ్బందవుతోంది.. నాకు క్రికెట్లో పని చూపించండంటూ మాజీ క్రికెటర్ ఆవేదన

 Former Cricketes Vinod Kambli Suffers With Financial Problems, He Is Only Income is Pension

భారత మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాడు. తనకు పని కావాలంటూ అభ్యర్థిస్తున్నాడు. క్రికెట్‌ అసైన్‌మెంట్ల కోసం ఎదురుచూస్తున్నాడు. 1990ల ప్రారంభంలో వినోద్ కాంబ్లీ తన కెరీర్‌ను సంచలనాత్మకంగా ప్రారంభించాడు. తన కెరీర్‌లో మొదటి ఏడు టెస్టుల్లో కాంబ్లీ రెండు డబుల్ సెంచరీలతో సహా 113.29సగటుతో 793పరుగులు చేసి హవా చూపించాడు. కానీ ఆ తర్వాత ఆడంబరమైన జీవనశైలికి అలవాటు పడి జట్టులో తరచు చోటు కోల్పోయేవాడు. ఇలా జట్టులోకి మొత్తం తొమ్మిదిసార్లు పునరాగమనాలు చేసిన తర్వాత కూడా అతను లయ అందుకోలేకపోయాడు. ఇక చివరకు వినోద్ కాంబ్లీ జట్టుకు శాశ్వతంగా దూరం కావాల్సొచ్చింది.

బీసీసీఐ ఇచ్చే పెన్షన్‌తోనే..

బీసీసీఐ ఇచ్చే పెన్షన్‌తోనే..

ప్రస్తుతం వినోద్ కాంబ్లీ ఏకైక ఆదాయం బీసీసీఐ అందించే రూ.30వేల పెన్షన్ మాత్రమే. ఈ విషయం పట్ల బీసీసీఐకి అతను థాంక్స్ చెబుతున్నాడు. కానీ అదే సమయంలో కాంబ్లీ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి క్రికెట్ సంబంధిత పనులను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని అని పేర్కొన్నాడు. ప్రస్తుతం పెరిగిన ఖర్చుల రీత్యా పెన్షన్ సరిపోవడం లేదని అతను అభిప్రాయపడుతున్నాడు. 'నేను రిటైర్డ్ క్రికెటర్‌ని.. బీసీసీఐ నుండి వచ్చే పెన్షన్‌పై ఆధారపడి ఉన్నాను. ప్రస్తుతానికి నా ఏకైక ఆదాయం పెన్షనే. ఈ విషయంలో బీసీసీఐకి తప్పకుండా కృతజ్ఞతలు చెబుతాను. ప్రస్తుతం ఇది నా కుటుంబాన్ని నిలబెడుతుంది' అని మిడ్-డేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంబ్లీ చెప్పాడు.

ముంబై క్రికెట్ అసోసియేషన్ పని ఇప్పించాలి

ముంబై క్రికెట్ అసోసియేషన్ పని ఇప్పించాలి

'నాకు క్రికెట్ అసైన్‌మెంట్లు కావాలి.. తద్వారా నేను యువకులతో కలిసి పని చేయగలను. క్రికెట్ నేర్పించినట్లు ఉంటుంది.. నాకు ఆదాయం వచ్చినట్లు ఉంటుంది. అందుకే ఈ సమయంలో నేను ముంబయి క్రికెట్ అసోసియేషన్ సహాయం కోరుతున్నాను. నేను CIC [క్రికెట్ ఇంప్రూవ్‌మెంట్ కమిటీ]లోకి వచ్చాను, కానీ అది గౌరవప్రదమైన పని. అందులో నాకంటూ వచ్చేదేమీ ఉండదు. నాకు ఒక కుటుంబం ఉంది.. అందువల్ల ముంబై క్రికెట్‌ను అభ్యర్థిస్తున్నాను. ఎలాంటి అసైన్ మెంట్లు ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ముంబై క్రికెట్ నాకు చాలా ఇచ్చింది. ఆ విషయంలో ముంబైకి నేను నా జీవితాంతం రుణపడి ఉన్నాను.' అని కాంబ్లీ పేర్కొన్నాడు.

సచిన్ నా ఫ్రెండే.. అతనికి అన్నీ తెలుసు కానీ..

సచిన్ నా ఫ్రెండే.. అతనికి అన్నీ తెలుసు కానీ..

కాంబ్లీ 2019లో ముంబై టీ20 లీగ్‌లో ఒక జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. అలాగే టెండూల్కర్ మిడిల్‌సెక్స్ గ్లోబల్ అకాడమీలో కూడా కోచ్‌గా పనిచేశాడు. ఆ జట్లలోని యువ క్రికెటర్లకు మార్గనిర్దేశం చేశాడు. కానీ టెండూల్కర్ అకాడమీ కోసం నెరుల్ వెళ్లడానికి చాలా దూరం ప్రయాణించాల్సి రావడంతో నేను శారీరకంగా అలసిపోయేవాడినంటూ పేర్కొన్నాడు. ఇక సచిన్ టెండూల్కర్‌కు తన ఆర్థిక పరిస్థితి గురించి తెలిసినప్పటికీ.. అతని నుంచి నేను ఇంకా ఏమీ ఆశించాలనుకోవట్లేదు అని కాంబ్లీచెప్పాడు. 'సచిన్‌కు నా గురించి ప్రతిదీ తెలుసు.. కానీ నేను అతని నుంచి ఏమీ ఆశించడం లేదు. అతను నాకు TMGA (టెండూల్కర్ మిడిల్‌సెక్స్ గ్లోబల్ అకాడమీ) అసైన్‌మెంట్ ఇచ్చాడు. అందులో అప్పట్లో ఆదాయం వచ్చేది. అతను మంచి స్నేహితుడు. అతను ఎప్పుడూ నాకు అండగా ఉంటాడు. ' అని కాంబ్లీ చెప్పాడు.

Story first published: Wednesday, August 17, 2022, 13:10 [IST]
Other articles published on Aug 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+