Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌ అత్యుత్త‌మ బౌల‌ర్‌గా లసిత్ మలింగ!!

Former cricketers name Lasith Malinga as greatest bowler of IPL

ఢిల్లీ: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో అత్యుత్త‌మ బౌల‌ర్ శ్రీలంక పేసర్ ల‌సిత్ మలింగనే అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీట‌ర్స‌న్ పేర్కొన్నాడు. డెత్ ఓవ‌ర్స్‌లో త‌న అద్భుత బౌలింగ్‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను హ‌డ‌లెత్తించే మలింగకు ఎదురు లేద‌ని కేపీ తెలిపాడు. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కోసం లీగ్ ఆరంభం నుండి ఆడిన మలింగకు స్టార్ స్పోర్ట్స్ ఈ గౌరవం ఇచ్చింది.

122 మ్యాచ్‌లు.. 170 వికెట్లు:

122 మ్యాచ్‌లు.. 170 వికెట్లు:

ఐపీఎల్ లీగ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 122 మ్యాచ్‌లు ఆడి 170 వికెట్లు ప‌డ‌గొట్టిన మ‌లింగ అత్యంత వికెట్లు ప‌డ‌గొట్టిన బౌల‌ర్ల జాబితాలో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టిన మొదటి బౌలర్ అయిన మలింగ.. భువనేశ్వర్ కుమార్, ఆశిష్ నెహ్రా, రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా, ఇమ్రాన్ తాహిర్, యుజ్వేంద్ర చాహల్, డేల్ స్టెయిన్, సునీల్ నరైన్, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి టాప్ బౌలర్లను ఓడించి ఈ గౌరవం దక్కించుకున్నాడు. స్టార్ స్పోర్ట్స్ వ్యాఖ్యాతలలో కెవిన్ పీటర్సన్, డీన్ జోన్స్, మాథ్యూ హేడెన్, ఆకాష్ చోప్రా, గ్రేమ్ స్మిత్, సైమన్ డౌల్, ఇయాన్ బిషప్, టామ్ మూడీలు మలింగకే ఓటేశారు.

మ‌లింగ అత్యుత్త‌మ బౌల‌ర్‌:

మ‌లింగ అత్యుత్త‌మ బౌల‌ర్‌:

ఈ అవార్డుకు లసిత్ మలింగనే ఎన్నుకోవాలనే తన నిర్ణయాన్ని కెవిన్ పీటర్సన్ వివరించాడు. 'నా వ‌ర‌కైతే మ‌లింగ బెస్ట్‌. యార్క‌ర్‌లు వేయ‌డంలో అత‌డిని మించిన వారు లేర‌ని నా అభిప్రాయం. డెత్ ఓవ‌ర్స్‌లో నిల‌క‌డ క‌న‌బ‌ర్చ‌డం అంతా తేలికైన విష‌యం కాదు. అందుకే మ‌లింగ అత్యుత్త‌మ బౌల‌ర్‌. నరైన్‌ కూడా వికెట్లు పడగొట్టాడు. కానీ అనుమానిత బౌలింగ్ కారణంగా కొన్ని సందర్భాల్లో ప్రశ్నించబడ్డాడు. అందుకే నేను మ‌లింగ బెస్ట్‌ అంటున్నా' అని పీట‌ర్స‌న్ చెప్పాడు.

ప‌ది మంది బౌల‌ర్లను వెనక్కి నెట్టి:

ప‌ది మంది బౌల‌ర్లను వెనక్కి నెట్టి:

స్టార్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసిన జ్యూరీ.. ప‌ది మంది బౌల‌ర్ల పేర్ల‌ను ప్ర‌తిపాదిస్తే అందులో ఇమ్రాన్ తాహిర్‌, సునీల్ న‌రైన్‌, జ‌స్ప్రీత్ బుమ్రా, డెల్ స్టెయిన్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ల‌ను వెన‌క్కి నెట్టి లసిత్ మ‌లింగ అగ్ర‌స్థానంలో నిలిచాడు. స్టార్ స్పోర్ట్స్ వ్యాఖ్యాతలు అందరూ కూడా మ‌లింగనే సమర్ధించారు. మలింగ లంక తరఫున 84 టీ20లు ఆడి 107 వికెట్లు పడగొట్టాడు. ఒకసారి 5 వికెట్లు తీసి ఆరు పరుగులు ఇచ్చాడు.

ధోనీ ఆల్​టైం అత్యుత్తమ కెప్టెన్:

ధోనీ ఆల్​టైం అత్యుత్తమ కెప్టెన్:

క్రికెట్ చరిత్రలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీయే అత్యుత్తమ కెప్టెన్ అని కెవిన్ పీటర్సన్ ఇటీవలే కితాబిచ్చాడు. ఈ విషయంపై చర్చ జరిగినా.. ధోనీ గొప్పతనానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఎవరికైనా చాలా కష్టమని ఇంగ్లీష్ మాజీ కెప్టెన్ తేల్చిచెప్పాడు. కెవిన్ పీటర్సన్ తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ... 'టీమ్​ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు సారథ్యం వహించి ధోనీ ఎన్ని ఘనతలు సాధించాడో తెలుసు. అతడి జీవన విధానం తెలుసు. అందరికీ అతడిపై ఎన్ని అంచనాలు ఉన్నాయో కూడా తెలుసు. అందుకే ధోనీ గొప్పతనానికి వ్యతిరేకంగా వాదించడం చాలాకష్టం' అని పేర్కొన్నాడు.

Story first published: Tuesday, April 21, 2020, 13:57 [IST]
Other articles published on Apr 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+