Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వార్నర్ భార్య గురించి తప్పుగా మాట్లాడటం వల్లే!: డీకాక్‌పై ఆవేశం

Former cricketers involve in a Twitter banter over Warner-De Kock incident

హైదరాబాద్: డర్బన్ వేదికగా ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ ఏబీ డివిలియర్స్‌ల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదంపై ఇరు జట్లకు చెందిన మాజీ క్రికెటర్లు స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకున్న ఆసీస్ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

డేవిడ్ వార్నర్‌ను వ్యక్తిగతంగా దూషించినందువల్లే అతడి నుంచి అంతటి రియాక్షన్ వచ్చిందని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు. ఈ గొడవకు కారణం దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్... డేవిడ్ వార్నర్ భార్య గురించి ఏదో తప్పుగా మాట్లాడటమేనని, ఇది ఎంతమాత్రం మంచిది కాదని పేర్కొన్నాడు.

గిల్‌క్రిస్ట్ ట్వీట్‌కు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్రేమ్ స్మిత్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లతో డేవిడ్ వార్నర్ ఎన్నో వ్యక్తిగత బౌండరీలు దాటాడని, ఇలాంటి రియాక్షన్ రావడం తమను ఎంతమాత్రం ఆశ్చర్యానికి గురి చేయలేదని అన్నాడు. స్లెడ్జింగ్ చేయడం తమకు ఆనందాన్ని కలిగిస్తుందంటే, ప్రత్యర్ధి జట్టు స్లెడ్జింగ్ చేసేటప్పుడు అలాగే పరిగణించాలని అన్నాడు.

గిల్‌క్రిస్ట్ ఆ తర్వాతి ట్వీట్‌లో నాతో పోలిస్తే ఈ యాక్షన్‌కు నువ్వే క్లోజ్‌గా ఉన్నావు. ఏది అయితేనేం క్రికెట్‌లో వ్యక్తిగత దూషణలు ఎంత మాత్రం మంచిది కాదని పేర్కొన్నాడు.

ఇందుకు గాను వంద శాతం కరెక్ట్ అని ట్వీట్ చేసిన స్మిత్ త్వరలోనే కలుస్తానని పేర్కొన్నాడు.

అసలేం జరిగింది?
తొలి టెస్టు నాలుగో రోజైన ఆదివారం టీ బ్రేక్ సమయంలో డేవిడ్‌ వార్నర్‌.. ఆతిథ్య జట్టు వికెట్‌ కీపర్‌ డీకాక్‌పై మాటల యుద్ధానికి దిగాడు. టీ బ్రేక్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల తమ తమ డ్రస్సింగ్‌ రూమ్‌లకు వెళ్లే క్రమంలో ముందుగా ఆసీస్‌ ఆటగాళ్లు మెట్లు ఎక్కుతున్నారు. వారి వెనుకనే దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డీకాక్‌ వస్తున్నాడు.

ఈ సమయంలో మెట్లు ఎక్కుతూ డీకాక్‌పై వార్నర్ తన మాటలతో విరుచుకుపడ్డాడు. సహచర ఆటగాళ్లు వద్దు అని వారిస్తున్నా వార్నర్ దూకుడు ప్రదర్శించాడు. ఈ సమయంలో వార్నర్‌ వెంట ఉస్మాన్ ఖవాజా, టిమ్ పైనీలు ఉన్నారు. ఆ తర్వాత కాసేపటికి కెప్టెన్‌ స్మిత్‌ వచ్చి వార్నర్‌ను డ్రస్సింగ్ రూమ్‌లోకి తీసుకువెళ్లిపోయాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో మొత్తం కింగ్స్ మీడ్ స్టేడియంలో మెట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోను స్థానిక మీడియా బయటపెట్టడంతో ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి క్రికెట్ ఆస్ట్రేలియా విచారణకు ఆదేశించింది.

గొడవ ఎలా మొదలైందో అనే విషయంపై విచారణ చేస్తున్నామని, నిజానిజాలు తెలిసేవరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోబోమని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి ఒకరు తెలిపారు.

Story first published: Monday, March 5, 2018, 17:27 [IST]
Other articles published on Mar 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+