Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Team India: ధోనీని మళ్లీ కెప్టెన్ చేయండి.. టీమిండియాపై షాకింగ్ కామెంట్స్ చేసిన మాజీలు!

Former Cricketers demand to appoint MS Dhoni as captain again after T20 World Cup snub

టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో చావుదెబ్బ తిన్న భారత జట్టు అభిమానులందరికీ షాకిచ్చింది. ఈసారి ఎలాగైనా కప్పు కొడుతుందని అనుకున్న టీమిండియా నాకౌట్ మ్యాచ్‌లో ఇలా చేతులెత్తేయడం ఆందోళన కలిగించే అంశం. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టు ప్రదర్శనను మెరుగు పరిచేందుకు మాజీ క్రికెటర్లు పలు సూచనలు చేశారు. వాటిని ఒకసారి గమనిస్తే..

 ధోనీని కెప్టెన్ చేయండి..

ధోనీని కెప్టెన్ చేయండి..

ఐసీసీ టోర్నీల్లో భారత జట్టు గోల్డెన్ టైం అంటే ధోనీ నాయకత్వంలోనే అని చెప్పాలి. ఆ టైంలోనే 2007 టీ20 వరల్డ్ కప్‌తోపాటు 2011 వన్డే ప్రపంచకప్‌ కూడా భారత్ గెలిచింది. ఇదే విషయాన్ని చెప్పిన మాజీ క్రికెటర్ అతుల్ వాసన్.. మరోసారి జట్టు పగ్గాలను ధోనీకి ఇవ్వాలన్నాడు. అయితే అతన్ని జట్టులో ఆడించాలని వాసన్ అనలేదు. 'టెన్నిస్‌లో ఉన్నట్లు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా ధోనీని నియమించండి. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం' అని ఆయన అన్నాడు.

ఇద్దరు లీడర్లు

ఇద్దరు లీడర్లు

టీమిండియా ఓటమికి ప్రధానంగా వినిపిస్తున్న మరో కారణం.. ఎక్కువ మంది లీడర్లు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పించుకున్న తర్వాత స్వల్ప వ్యవధిలోనే భారత జట్టుకు చాాలా మంది సారధ్య బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం జట్టులో ఉన్న వారిలో కూడా పంత్, పాండ్యా, రాహుల్ ఈ జట్టుకు సారధ్యం వహించిన వారే.

ఈ గొడవలేమీ లేకుండా జట్టులో ఇద్దరు నాయకులను ఎంపిక చేసుకొని, వారిని గ్రూమ్ చేయాలని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. 'పాండ్యా తన కెప్టెన్సీని ఐపీఎల్‌లో నిరూపించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌కు అద్భుతమైన సేవలందించాడు. జట్టులో ఇద్దరు నాయకులు ఉంటే ఆటతీరు మారుతుంది' అని పఠాన్ అన్నాడు.

ద్రావిడ్‌ను తప్పించండి..

ద్రావిడ్‌ను తప్పించండి..

ప్రపంచకప్ నుంచి భారత్ నిష్క్రమించిన తర్వాత విమర్శల పాలైన వారిలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఒకడు. ద్రావిడ్ అద్భుతమైన కోచ్ అయినా సరే.. పొట్టి ఫార్మాట్‌కు అతను సరిపోడని పలువురు అన్నారు. ఈ క్రమంలోనే జట్టుకు ఈ ఫార్మాట్‌లో వీరేంద్ర సెహ్వాగ్ లేదా గౌతమ్ గంభీర్‌ను కోచ్‌గా నియమించాలని మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా సూచించాడు.

వేరు వేరు జట్లు..

వేరు వేరు జట్లు..

భారత క్రికెట్‌లో తీసుకురావలసిన మార్పులపై మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లే కూడా సూచనలు చేశాడు. వేరు వేరు ఫార్మాట్లకు వేరు వేరు జట్లను ఎంపిక చేయాలని సూచించాడు. 'కచ్చితంగా వేరు వేరు జట్లు కావలసిందే. గతేడాది గెలిచిన ఆస్ట్రేలియా, ఇప్పడు విజేతలు ఇంగ్లండ్ జట్లను చూడండి. వాళ్ల బ్యాటింగ్ ఆర్డర్లో ఎంతమంది ఆల్‌రౌండర్లు ఉన్నారు? ఆల్‌రౌండర్లపై ఫోకస్ చెయ్యాలని ఈ రెండు జట్లు నిరూపించాయి' అని కుంబ్లే అన్నాడు.

బౌలింగ్ ఆప్షన్స్ లేవు

బౌలింగ్ ఆప్షన్స్ లేవు

భారత జట్టు వద్ద పెద్దగా బౌలింగ్ ఆప్షన్స్ లేవని మాజీ ఓపెనర్ పార్థివ్ పటేల్ అన్నాడు. 'ప్రపంచ ఛాంపియన్లు అవ్వాలంటే బౌలింగ్ చేయగలిగే బ్యాటర్లు చాలా అవసరం. వీళ్ల వల్ల జట్టులోని మిగతా బౌలర్లు, కెప్టెన్‌కు ఊపిరి తీసుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ప్రత్యర్థిపై ఎటాకింగ్ బౌలింగ్ చేయొచ్చు' అని పార్థివ్ అన్నాడు.

Story first published: Tuesday, November 15, 2022, 10:35 [IST]
Other articles published on Nov 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+