Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Super Ten: క్రికెట్ అభిమానులకు వినోదం పంచనున్న సూపర్ టెన్.. ఇందులో ఆడేది ఎవరంటే..

Former cricketers and film actors will participate in the Super Ten League in Bengaluru

భారత్ లో మరో మరో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబోతున్నారు. అయితే ఇందులో మాజీ క్రికెటర్లతోపాటు సెలబ్రెటీలు కూడా పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి కన్నడ నటుడు కిచ్చా సుదీప్, వెస్ట్ ఇండియన్ క్రికెట్ లెజెండ్ క్రిస్ గేల్ 'సూపర్ టెన్' మొదటి ఎడిషన్‌ను ప్రకటించారు. ఇది ఒక ప్రత్యేకమైన క్రికెట్ టోర్నమెంట్ గా నిర్వహించబోతున్నారు. ఇది భారతీయ నటులు, వివిధ దేశాల రిటైర్డ్ అంతర్జాతీయ క్రికెటర్లు, కార్పొరేట్ హోంచోస్‌లను 10 ఓవర్లలో మ్యాచ్ లో పాల్గొననున్నారు.

2 రోజుల పాటు

2 రోజుల పాటు

ఈ షార్ట్ ఫార్మాట్ క్రికెట్ టోర్నమెంట్ అత్యధిక వినోదం అందిస్తుంది. డిసెంబర్ 2022లో బెంగళూరులో 2 రోజుల పాటు ఈ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఈ లీగ్‌లో బాలీవుడ్, కన్నడ, తమిళం, తెలుగు పరిశ్రమలకు చెందిన నటులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెటర్లు పాల్గొనబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా క్రికెట్ స్నేహితులతో పాటు భారతీయ వినోద పరిశ్రమలో కొన్ని ప్రముఖులతో క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ క్రిస్ గేల్ అన్నారు.

క్రికెట్‌టైన్‌మెంట్

క్రికెట్‌టైన్‌మెంట్

సూపర్ T10 లీగ్ అనేది క్రికెట్, ఎంటర్‌టైన్‌మెంట్, కార్పొరేట్ సెక్టార్‌లోని మిత్రులు క్రీడలను ఆడేందుకు ఒక అద్భుతమైన అవకాశమని సుదీప్ అన్నారు. భారతీయులమైన మనం క్రికెట్‌ను ప్రేమిస్తున్నందున, నాలాంటి నటులకు క్రీడల పట్ల ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇది మంచి అవకాశమని చెప్పారు. 'క్రికెట్‌టైన్‌మెంట్' కాన్సెప్ట్‌పై ఒక సంవత్సరం నుంచి పని చేస్తున్నామని సూపర్ టెన్ క్రికెట్ CEO & వ్యవస్థాపకుడు దినేష్ కుమార్ అన్నారు.

వినోదం

వినోదం

ప్రేక్షకులకు వినోదం పంచడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ప్రపంచ క్రికెట్ ఆసక్తిని బలోపేతం చేయడమే టోర్నమెంట్ ఉద్దేశమని వివరించారు. వినోదం, క్రికెట్ పరిశ్రమలోని ముఖ్యులను టోర్నమెంట్ లో ఆడేందకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.

Story first published: Thursday, October 13, 2022, 15:36 [IST]
Other articles published on Oct 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+