బుడ్డోడి బిల్డప్ చూసి తొందరపడ్డాం.. సంజూనే అసలైన హీరో: మాజీ క్రికెటర్
టీమిండియా యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకునే విషయం టీమిండియా తొందరపడిందని మాజీ ప్లేయర్ వసీం జాఫర్ తీవ్రంగా విమర్శించారు. మీడియా సృష్టించిన మితిమీరిన ప్రచారం, అభిమానుల భావోద్వేగ ప్రసంగాలకు తలొగ్గి జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని చివరి టీ20 నుంచి వైభవ్ సూర్యవంశీని తొలగించి.. అతడి స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం ఇచ్చారు. వైభవ్ సూర్యవంశీ తాను ఆడిన మ్యాచ్‌లలో వరుసగా 14, 13, 15 పరుగులు మాత్రమే చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మీడియా హడావిడి వల్లే..
ఈ విషయంపై తన యూట్యూబ్ పేజీలో మాట్లాడిన వసీం జాఫర్ ఇలా అన్నారు. "జట్టు యాజమాన్యం వైభవ్ సూర్యవంశీని చాలా తొందరపాటుతో జట్టులోకి తీసుకువచ్చిందని నేను భావిస్తున్నాను. అతనిపై ఉన్న మీడియా ప్రచారం, అంచనాలు, అతని ఆటను చూడాలనే అభిమానుల భావోద్వేగ అంచనాలే దీనికి కారణం. నేను ఇదివరకే చెప్పినట్లుగా సంజు శాంసన్ జట్టులో ఉంచుకోవాల్సింది. వైభవ్ ఇంకా చిన్నవాడు కాబట్టి అతను జట్టుతో పాటు ప్రయాణించి బయటి నుంచి ఆటను దగ్గరగా నేర్చుకోవాల్సింది." అని వసీం జాఫర్ అభిప్రాయపడ్డారు. వైభవ్ సూర్యవంశీకి 3 మ్యాచ్‌లు అవకాశం ఇచ్చి చివరి మ్యాచ్‌లో మళ్లీ సంజూ శాంసన్ ను ఛాన్స్ ఇచ్చారు. కానీ జింబాబ్వే టీ20 సిరీస్‌కు భారత జట్టు నుంచి సంజూ శాంసన్‌ను తొలగించి వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించారు. ఇది చాలా వింతగా అనిపిస్తోందని వసీం జాఫర్ పేర్కొన్నారు.

సంజూ శాంసన్ భారత్ తరఫున ఒకే ఫార్మాట్ క్రికెట్ ఆడతాడని.. అతనికి అవకాశం ఇవ్వాలని వసీం జాఫర్ కోరారు. వచ్చే ప్రపంచ కప్ ప్రణాళికల్లో సంజూ శాంసన్ ఖచ్చితంగా ఉంటాడని.. కానీ జట్టు యాజమాన్యం సంజూ పట్ల వ్యవహరించిన తీరు తనను ఆశ్చర్యపరిచిందని విచారం వ్యక్తం చేశాడు. సంజూ శాంసన్‌కు భారత టీ20 జట్టులో అవకాశం ఇస్తారా లేదా అన్నదే ప్రశ్న. మరోవైపు జింబాబ్వే సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ పరుగులు చేయకపోతే, అతనికి చాలా ఏళ్ల పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడే అవకాశం లభించకపోవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications