INDvsNZ : శార్దూల్ వద్దు.. ఉమ్రాన్‌ను ఆడించాలన్న మాజీ దిగ్గజం!

న్యూజిల్యాండ్‌తో భారత జట్టు ఆడిన తొలి వన్డేలో టీమిండియా విజయంలో శార్దూల్ ఠాకూర్‌ది కీలక పాత్ర. ఆరంభంలో అంత అద్భుతంగా బౌలింగ్ చేయలేదు కానీ.. డెత్ ఓవర్లలో శార్దూల్ ఇరగదీశాడు. రెండు వికెట్లు తీసుకున్నాడు. ముఖ్యంగా భారీ షాట్లతో విరుచుకుపడుతున్న బ్రేస్‌వెల్‌ను అవుట్ చేసి మ్యాచ్ గతిని మార్చాడు. అయితే రెండో వన్డేలో అతన్ని ఆడించకూడదని మాజీ దిగ్గజం అంటున్నాడు. క్రికెట్ నుంచి కామెంటరీలోకి దిగి అద్భుతంగా పేరు సంపాదించిన ఆకాష్ చోప్రా ఈ కామెంట్స్ చేశాడు.

రోహిత్ సెంచరీ పెండింగ్..
చాలా సందర్భాల్లో టీమిండియా జయాపజాయలను ఆకాష్ చోప్రా కరెక్ట్‌గా ఊహించాడు. తన అంచనాల వెనుక కారణాలను కూడా అతను చక్కగా వివరిస్తాడు. దీంతో అతని వ్యాఖ్యలకు అభిమానులు చాలా విలువ ఇస్తారు. ఈ క్రమంలోనే రెండో వన్డేలో శార్దూల్‌ను పక్కన పెట్టాలని చోప్రా అనడం ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని చోప్రా చెప్పాడు. 'గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రోహిత్ నుంచి భారీ ఇన్నింగ్స్ రావలసి ఉంది. కోహ్లీ బాగానే ఆడుతున్నాడు' అని అన్నాడు.

బ్యాటింగ్ విభాగంలో మార్పుల్లేవ్..
సూర్యకుమార్‌కు మంచి ఆరంభం లభించిందని, ఇషాన్ కిషన్‌కు అది కూడా దొరకలదేని వివరించాడు. అలాగే హార్దిక్ పాండ్యా అవుట్ వివాదాస్పదం అవడాన్ని కూడా గుర్తుచేశాడు. వీళ్లంతా బాగానే ఆడుతున్న క్రమంలో తొలి ఆరు స్థానాల్లో.. ఎవరికైనా గాయమైతే తప్ప మార్పు అక్కర్లేదన్నాడు. ఇక కుల్దీప్ రాణించినా వాషింగ్టన్ సుందర్ సత్తా చాటాల్సి ఉందన్నాడు. తొలి వన్డేలో భారత బౌలింగ్ బలహీనత బయటపడిందని విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. బౌలింగ్ విభాగంలో మాత్రం ఒక్క మార్పు చేయాలని విశ్లేషించాడు.

శార్దూల్ రాణించినా కూడా..
'శార్దూల్ చక్కగా బౌలింగ్ చేశాడు. 8వ నెంబర్ వరకూ బ్యాటింగ్ చేయగలిగే వాళ్లు ఉండాలని టీం మేనేజ్‌మెంట్ అనుకోవడంలో తప్పేం లేదు. కానీ నన్నడిగితే మాత్రం ఉమ్రాన్‌ను ఆడించాల్సిందే అంటాను. వాషింగ్టన్ వరకు బ్యాటింగ్ చాలు. తర్వాత కుల్దీప్, ఉమ్రాన్, సిరాజ్, షమీ ఉంటారు. శార్దూల్‌పై నాకు ఎటువంటి కంప్లయింట్ లేదు.
కానీ నేనైతే ఉమ్రాన్‌ను ఆడిస్తానంతే' అని స్పష్టం చేశాడు. హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో ఉమ్రాన్‌ను పక్కన పెట్టడంపై అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్‌కు ఆడే అతనికి ఇది హోం గ్రౌండ్ వంటిదని, అలాంటి చోట ఉమ్రాన్‌ను ఆడించకపోవడం ఏంటని నెట్టింట పెద్ద గోల చేసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications