Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బిగ్‌బాస్ ఓటీటీ షో కంటెస్టెంట్‌గా మాజీ క్రికెటర్.. ఎప్పటి నుంచి ప్రారంభమంటే..?

Former Cricketer Vinay Kumar Will be Feature In Biggboss Kannada OTT Show

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన భారత మాజీ క్రికెటర్ వినయ్ కుమార్.. బుల్లితెర అరంగేట్రం చేయబోతున్నాడు. ప్రముఖ రియాల్టీ షో అయిన బిగ్‌బాస్‌లో అతను అడుగుపెట్టబోతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న కన్నడ బిగ్‌బాస్ షో ఓటీటీ వర్షన్‌కు అతను ఎంపికయ్యాడు. ఈ మేరకు బిగ్‌బాస్ కన్నడ రిలీజ్ చేసిన లిస్ట్ ఆఫ్ కంటెస్టెంట్లలో అతని పేరు ఉంది. ఇక ఈ షోకు ప్రముఖ కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తుంటారనే సంగతి తెలిసిందే. వయాకమ్ 18 యొక్క వీడియో-ఆన్-డిమాండ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన Voot ఓటీటీ యాప్‌.. బిగ్‌బాస్ కన్నడ ఓటీటీ షోను డిజిటల్ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ షో ఆగస్టు 6నుంచి ప్రసారం కానుంది. రౌండ్-ది-క్లాక్ కంటెంట్ డ్రాప్‌లు, పూర్తి ఇంటరాక్టివ్ 24బై7 లైవ్ ఫీడ్‌ను చూసే అవకాశాన్ని ప్రేక్షకులకు కల్పించనుండడం విశేషం.

ఇటీవలే వినయ్ కుమార్, రిచా దంపతులకు బేబీ గార్ల్‌ పుట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వినయ్ కుమార్ తెలియజేశాడు. ఇకపోతే వినయ్ కుమార్ భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. అతను 31వన్డేల్లో 38 వికెట్లు, 9 టీ20 మ్యాచుల్లో 10వికెట్లు పడగొట్టాడు. ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడాడు. వినయ్ కుమార్ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడి మంచి పేరు సంపాదించాడు. అతను ముంబైతో సహా 3 జట్లకు ఆడాడు. కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరఫున కూడా ఐపీఎల్లో మంచి ప్రదర్శనే చేశాడు. ఇక వినయ్ కుమార్ మొత్తం 105ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 105 వికెట్లు తీసుకున్నాడు.

Story first published: Tuesday, August 2, 2022, 16:03 [IST]
Other articles published on Aug 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+