For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తండ్రైన వినయ్ కుమార్.. భగవంతుడిచ్చిన గిఫ్ట్ అంటూ ఖుషీ

Former Cricketer Vinay Kumar Became Father, He shares his Cute Baby Girl photo along with his wife

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన భారత మాజీ క్రికెటర్ వినయ్ కుమార్ ఇంట్లో సందడి నెలకొంది. ఈ మాజీ క్రికెటర్ ఇంటికి లక్ష్మీ దేవీ వచ్చింది. అతని భార్య బేబీ గార్ల్‌కు జన్మనిచ్చింది. శిశువు ఆరోగ్యకరంగా ఉంది. ఇక తాను త్వరలో తండ్రి కాబోతున్నానని, తన భార్య గర్భవతి అని వినయ్ కుమార్ కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇక ఆమె ఇటీవలే డెలివరీ కాగా.. వినయ్ కుమార్ తన భార్య రిచాతో కలిసి అప్పుడే పుట్టిన కూతురుతో ఓ ఫోటో దిగాడు. దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ రోజు మా జీవితంలోకి పండంటి బేబీ గార్ల్ వచ్చిందని తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఇది మాకు భగవంతుడు ఇచ్చిన మధురమైన బహుమతి అని వినయ్ కుమార్ పేర్కొన్నాడు.

ఇకపోతే వినయ్ కుమార్ భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. వినయ్ 1 టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అందులో అతను ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. ఇది కాకుండా 31వన్డేల్లో 38 వికెట్లు, 9 టీ20 మ్యాచుల్లో 10వికెట్లు పడగొట్టాడు. వినయ్ కుమార్ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడి మంచి పేరు సంపాదించాడు. అతను ముంబైతో సహా 3 జట్లకు ఆడాడు. కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరఫున కూడా ఐపీఎల్లో మంచి ప్రదర్శనే చేశాడు. ఇక వినయ్ కుమార్ మొత్తం 105ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 105 వికెట్లు తీసుకున్నాడు.

Story first published: Friday, June 24, 2022, 13:58 [IST]
Other articles published on Jun 24, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+