Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohith Sharma: రోహిత్ శర్మ తన చివరి టెస్టు మ్యాచ్ ఆడేశాడు..!

చివరి టెస్ట్ లో రోహిత్ శర్మ ఆడకపోవడంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన చివరి టెస్టు మ్యాచ్ ఆడినట్లు గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 5వ టెస్ట్ మ్యాచ్ లంచ్ విరామ సమయంలో మాట్లాడిన గవాస్కర్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 చివరి టెస్ట్ మ్యాచ్ నుంచి తనకు తానుగా విశ్రాంతి తీసుకోవాలనే రోహిత్ శర్మ నిర్ణయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలన్నాడు.

భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించలేదని తను అనుకుంటున్నట్లుగా చెప్పాడు. బహుశా తాము టెస్టు క్రికెట్‌లో చివరిసారిగా రోహిత్ శర్మను చూశామని సునీల్ గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్‌తో పేర్కొన్నాడు. సిరీస్‌లోని చివరి టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడం వెనుక సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ పాత్ర ఉందని గవాస్కర్ వాదించారు. సిడ్నీ టెస్టుకు ముందు భారత్ 1-2తో వెనుకబడి ఉంది.

Former cricketer Sunil Gavaskar said that Rohit Sharma has played his last Test match

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో నిలవాలంటే సిరీస్‌లోని చివరి టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించాలన్నారు. భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కూడా గవాస్కర్ లాగానే అభిప్రాయపడ్డారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నాడు. రోహిత్ శర్మ ఈ సిరీస్ లో మూడు మ్యాచ్ లు ఆడాడు. సిరీస్ లో కేవలం 31 ​​పరుగులే చేశాడు. ఒకసారి మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. రోహిత్ 15 ఇన్నింగ్స్‌లలో కేవలం 10.93 సగటుతో 164 పరుగులు చేశాడు.

ఈ నేపథ్యంలో అతడిపై వేటు వేయాలని డిమాండ్ పెరిగింది. అయితే అతను కెప్టెన్ కాబట్టి అంత త్వరగా వేటు వేయ్యరని అనుకున్నారు. అయితే సిడ్నీ మ్యాచ్ ఒక రోజు ముందు టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మీడియా సమావేశానికి హాజరయ్యారు. సిడ్నీ టెస్ట్ లో రోహిత్ ఆడతాడా అన్న ప్రశ్నకు పిచ్ పరిశీలించన తర్వాత తుది జట్టును ప్రకటిస్తామని గంభీర్ చెప్పాడు. దీంతో చివరి మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడకపోవచ్చని అందురు అన్నుకున్నారు. అనుకున్నట్లుగానే జరిగింది.

Story first published: Friday, January 3, 2025, 18:00 [IST]
Other articles published on Jan 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+