Rishabh Pant: స్టుపిడ్, స్టుపిడ్.. రిషబ్ పంత్ పై రెచ్చిపోయిన గవాస్కర్..!
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆటలో కొత్తదానాన్ని వెతుకుతుంటాడు. ప్రయోగాత్మకమైన షాట్లు ఆడుతాడు. అయితే ఇది మంచిదే అయినప్పటికీ ఎప్పుడు పడితే అప్పుడు ప్రయోగాలు చేస్తే దెబ్బ తింటాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ లో జరుగుతున్న మ్యాచ్ లో పంత్ ఔట్ అయిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో పంత అనవసరంగా షాట్ ఆడి వికెట్ పడేసుకున్నాడు. ఓవర్ నైట్ స్కోర్ 164/5 వద్ద మూడో బ్యాటింగ్ దిగిన ఇండియా ఆదిలోనే వికెట్ కోల్పోయింది.
బోలాండ్ బౌలింగ్ లో స్కూఫ్ షాట్ ఆడడానికి పంత్ ప్రయత్నం చేశాడు. అయితే అది కాస్త క్యాచ్ గా వెళ్లింది. డీప్ థర్డ్ మ్యాన్ పొజిషన్ వద్ద ఉన్న లయన్ క్యాచ్ పట్టడంతో పంత్ వెనుదిరగాల్సి వచ్చింది. భారత్ కు పాలో ఆన్ గండం ఉన్నప్పటికీ పంత్ అలా ఆడడంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యారు. జట్టును ఫాలో ఆన్ గండం వెంటాడుతుంటే.. పంత్ ఇష్టమొచ్చినట్లు ఆడతాడా అని గవాస్కర్ ప్రశ్నించారు.

"స్టుపిడ్, స్టుపిడ్, స్టుపిడ్.. ఇది మూర్ఖత్వం కాదు, అంతకుమించి.. మీరు అటువంటి షాట్ ఆడతారని తెలిసి అక్కడ ఇద్దరు ఫీల్డర్లను పెట్టాడు. అయినప్పటికీ అలాంటి షాట్ ఆడారంటే మిమ్మల్ని ఏం అనాలో అర్థం కావట్లేదు. జట్టు పరిస్థితులు అర్థం చేసుకోవాలి కదా" అంటూ ఊగిపోయాడు. అప్పటికే ఫైర్ మీద ఉన్న గవాస్కర్ ను హర్షా భోగ్లే మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. ఇలా ఆడి ఔట్ అయ్యకా.. రిషబ్ పంత్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తాడా అని అడగ్గా.. దానికి గవాస్కర్ సమాధానం ఇస్తూ.. ఇండియా వెళ్లకూడదని అని అన్నాడు.
.కష్టాల్లో ఉన్న భారత జట్టును నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఆదుకున్నారు. ఇద్దరు కలిసి మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. హాఫ్ సెంచరీ చేసిన సుందర్ ఔట్ కాగా.. మరో ఎండ్ లో సమయమనంతో ఆడుతున్న నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ పూర్తి చేసుకున్నారు. తన కేరీర్ లో మొదటి టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. నితీష్ కుమార్ పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిస్తున్నారు. కాగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది.
One-Sided Kalesh b/w Sunil Gavaskar Saab and Rishabh Pant after he got Out:
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 28, 2024
pic.twitter.com/ULxQofgP6f
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications