
టీ20 ప్రపంచ కప్ 2022 ప్రారంభం అయింది. ప్రారంభంలోనే పలు జట్లు సంచలనాలు క్రియేట్ చేశాయి. క్వాలిఫైయర్‌లలో నమీబియా శ్రీలంకను చిత్తు చేసింది. వెస్టిండీస్‌పై స్కాట్‌లాండ్ విజయం సాధించింది. ఈనెల 22న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ తో సూపర్ 12 దశ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 23న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్థాన్‌తో టీమ్ ఇండియా తలపడనుంది. సోమవారం జరిగిన వార్మప్ గేమ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించడంతో రోహిత్ అండ్ కో మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది.
భారత్, ఆస్ట్రేలియా
అయితే అప్పుడే ఈ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్ల జట్ల గురించి మాట్లాడుకుంటున్నారు. భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఫైనల్ కు వెళ్లే జట్లను అంచనా వేశారు. భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ కు వెళ్తాయని చెప్పాడు. ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ టామ్ మూడీ కూడా ఈ రెండు జట్లను తన ఫైనలిస్టులుగా ఎంచుకున్నాడు. "భారత్ కచ్చితంగా ఫైనల్ కు వెళ్తుంది. ఆస్ట్రేలియా కూడా ఫైనల్ ఆడుతుంది" అని గవాస్కర్ అన్నారు.
విరాట్ కోహ్లీ..
"నేను మీకు మొదటి నాలుగు ఇవ్వబోతున్నాను. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వారి గ్రూప్ నుంచి వెళ్తాయి. పాకిస్తాన్, భారత్ ఇతర గ్రూప్‌కు నాయకత్వం వహిస్తాయని నేను భావిస్తున్నాను" అని టామ్ మూడీ చెప్పాడు. ప్యాట్ కమిన్స్‌ను క్యాచ్ ను లాంగ్ ఆన్‌లో విరాట్ కోహ్లీ స్టన్నింగ్ పట్టుకున్నాడు. ప్రస్తుతం కోహ్లి ఫీల్డింగ్ గురించి అందరు మాట్లాడుతున్నారు. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా బుధవారం జరిగే రెండో, చివరి వార్మప్ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌తో ఆడుతుంది.