T20 World Cup 2022: పాక్ కెప్టెన్ సరిగా లేడు.. బాబర్ అజాంపై అక్తర్ కామెంట్స్..

టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా.. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ గ్రూప్ 2 మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో పాకిస్థాన్ ఓడిపోయింది. దీనిపై దిగ్గజ పాక్ పేసర్ షోయబ్ అక్తర్ నిరాశ వ్యక్తం చేశాడు. అక్తర్ పాక్ వ్యూహాలపై మండిపడ్డాడు. బాబర్ అజాం సరిగా కెప్టెన్ చేయలేదని అభిప్రాయపడ్డాడు.
"నేను ఇంతకు ముందే చెప్పాను. మన టాప్, మిడిల్ ఆర్డర్‌తో మనం పెద్ద విజయాన్ని సాధించగలమని నేను మళ్లీ చెబుతున్నాను. జట్టును నిలకడలేకుండా ఉంది. పాకిస్థాన్‌కు సరైన కెప్టెన్ లేడు. పాక్ ఓడిపోయిన మ్యాచ్ ల్లో నవాజ్ చివరి ఓవర్‌ను బౌల్ చేసాడు" అని అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.

బాబర్
బాబర్ బ్యాటింగ్ ఆర్డర్‌తో సహా పాకిస్థాన్ పలు విషయాలపై దృష్టి పెట్టాలని అక్తర్ సూచించాడు. "బాబర్ వన్ డౌన్ బ్యాటింగ్ చేయాలి. షాహీన్ షా అఫ్రిది ఫిట్‌నెస్‌లో ప్రధాన లోపం. కెప్టెన్సీలో కూడా లోపం ఉంది" అని చెప్పాడు.పాకిస్థాన్ తన తదుపరి సూపర్ 12 మ్యాచ్‌లో ఆదివారం నెదర్లాండ్స్‌తో తలపడనుంది. టీ20 ప్రపంచకప్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఒక పరుగు తేడాతో జింబాబ్వే చేతిలో ఓడిపోయింది.

సీన్ విలియమ్స్
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులుచేసింది. ఓపెనర్లు కాస్త ఫర్వాలేదనిపించినా.. ఆ తర్వాత వచ్చిన వారు త్వరగా పెవిలియన్ చేరారు. ఓపెనర్ మాధేవేరే 17 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ క్రెయిగ్ ఎర్విన్ 19 పరుగులు చేశాడు. సీన్ విలియమ్స్ 28 బంతుల్లో 31 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో బ్రాడ్ ఎవాన్స్ 19 పరుగులు చేయడంతో జింబాబ్వే ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది.

షాన్ మసూద్
131 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది.పాక్ కెప్టెన్ బాబర్ అజాం 4 పరుగులకే ఔటయ్యాడు. మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 14 పరుగులకు పెవిలియన్ చేరాడు. షాన్ మసూద్ 38 బంతుల్లో 3 ఫోర్లతో 44 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మహ్మద్ నవాజ్ 18 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్ తో 22 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications