Rohit Sharma: రోహిత్ ఏం చెయ్యలేదు.. మైదానంలో దాక్కున్నాడంతే.. కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ ఫైర్!

గడిచిన మూడు నెలల్లో భారత జట్టు రెండు మేజర్ టోర్నమెంట్లను చేజార్చుకుంది. ఆసియా కప్‌లో పాకిస్తాన్, శ్రీలంక జట్ల చేతుల్లో ఓటమి ఎదుర్కొన్న భారత్..
సూపర్-4 దశలో ఇంటి దారి పట్టింది. దీంతో ప్రపంచకప్ గెలవడం అసాధ్యమని అభిమానులు భయపడ్డారు. అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై సిరీసులు గెలవడంతో మరోసారి అభిమానుల మనసుల్లో ఆశలు చిగురించాయి. కానీ వాటిని వమ్ము చేసిన టీమిండియా సెమీఫైనల్‌లో ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తయింది.

అదే బాధ..
ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత జట్టు ఆటతీరుపై మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ కూడా ఆందళన కనబరిచాడు. ఓటమి కన్నా ఓడిన విధానమే బాధ కలిగిస్తోందని చెప్పాడు. 'భారత జట్టు అడిలైడ్‌లో బ్యాటింగ్ చేస్తే.. ఇంగ్లండ్ టీం మాత్రం షార్జాలో ఆడినట్లు కనిపించింది' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏమాత్రం పోరాటం లేకుండా ఇంగ్లండ్ జట్టు ముందు టీమిండియా మోకరిల్లిందన్నాడు. ఈ క్రమంలోనే టీం సారధిగా రోహిత్‌ను కొనసాగించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

వాళ్లిద్దరూ ఆప్షన్లే..
భారత జట్టు భవిష్యత్తులో ఎటు వెళ్లాలనే నిర్ణయం తీసుకునే తరుణం ఇదేనన్న అతుల్.. హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్‌లలో ఒకరిని కెప్టెన్ చేయాలన్నాడు. దీంతో భారత ప్రయాణం ఎటువైపు అనే అంశంపై ఒక స్పష్టత వస్తుందని చెప్పాడు. 'రెండు ప్రపంచకప్‌ల మధ్యలో ఇలాంటి ప్లానింగ్ చేసుకుంటారు. రోహిత్‌ను ఈ ఫార్మాట్‌లో కొనసాగించడం వల్ల ఏమాత్రం ఉపయోగం ఉంటుందని నేను అనుకోవడం లేదు' అని తేల్చిచెప్పాడు.

రోహిత్ వల్ల ఉపయోగం లేదు..
సెమీస్ ఓటమిపై మండిపడిన అతను.. రోహిత్ శర్మపై తీవ్రమైన విమర్శలు చేశాడు. భారత కెప్టెన్ మ్యాచ్‌ను తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నమే చేయలేదన్నాడు. నిర్ణయాలన్నీ టీం మేనేజ్‌మెంట్ తీసుకుందని, రోహిత్ ఏం చెయ్యలేదని విమర్శించాడు. 'ఇక్కడ రెండు రకాల క్రికెటర్లు కనిపించారు. రోహిత్‌ను కూడా ఏం అనలేం. ఎందుకంటే మ్యాచ్‌లో నిర్ణయాలన్నీ జట్టు మేనేజ్‌మెంట్ తీసుకుంది. రోహిత్ కేవలం మైదానంలో ఎవరికీ కనిపించకుండా దాక్కున్నాడంతే' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications