గుజరాత్ ఎన్నికలు: భార్యతో కలిసి ఓటు వేసిన మాజీ క్రికెటర్ మోంగియా

హైదరాబాద్: టీమిండియా మాజీ వికెట్ కీపర్ నయన్ మోంగియా గుజరాత్ రెండో దశ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోంగియాతో పాటు ఆయన భార్య తనూ మోంగియా వడోదరలోని అకోటా ఏరియా పోలింగ్ బూత్‌లో గురువారం ఓటు వేశారు.
అనంతరం నయన్ మోంగియా మీడియాతో మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఇక, నయన్ మోంగియా భార్య తనూ మాట్లాడుతూ ఏ అభ్యర్థి గెలవాలన్నా ఓట్లు ఎంతో కీలకమని అన్నారు. మంచి ప్రభుత్వం కావాలనుకుంటే కచ్చితంగా ఓటు వేయాలని ఆమె సూచించారు.
ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందని అడిగినప్పుడు 'ఎవరికి ఓటు వేయాలనే విషయంలో తక్కిన ఓటర్ల తరహాలోనే మేము కూడా కొంత తికమకగు గురయ్యాం. అదే ప్రజాస్వామ్యం గొప్పతనం. ఈ ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలివిగా ఆలోచించి ఓటేయడమే మనం చేయాల్సింది' అని ఆమె అన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications