IPL 2022: ఆ నిర్ణయం నన్నేమి ఆశ్చర్యపరచలేదు.. సీఎస్కేను జడేజా గెలిపిస్తాడు

ఐపీఎల్ 2022లో చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు. రవీంద్ర జడేజా ధోని మాదిరిగానే ప్రశాంతమైన ఆటగాడని అతని మాదిరిగానే జట్టును విజయవంతంగా నడిపిస్తాడని ఆత్మ విశ్వాసం వ్యక్తం చేశాడు. మైదానంలో జడేజా చురుగ్గా ఉంటాడని, సరైన నిర్ణయాలు తీసుకుంటాడని చెప్పుకొచ్చాడు.

నాకు ఆశ్చర్యం కల్గించలేదు
ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా నియమించడం తనకు ఎలాంటి ఆశ్చర్యం కల్గించలేదని పీటర్సన్ తెలిపాడు. బహుషా కెప్టెన్‌గా తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అని ధోని భావించి ఉండవచ్చని, అందుకే తప్పుకున్నాడని పేర్కొన్నాడు. జడేజా మంచి ఆటగాడే కాకుండా తెలివైన క్రికెటర్ అని ఆయన చెప్పుకొచ్చాడు. టీ20ల్లో ఎంతో అనుభవం ఉన్న జడేజా.. ధోనిలా ప్రశాంతంగా ఉంటాడని పీటర్సన్ అన్నాడు.

ఈ సారి కూడా టైటిల్ గెలిచే అవకాశం
ఇక రవీంద్ర జడేజా నేతృత్వంలోని చెన్నైసూపర్ కింగ్స్ ఈ సారి కూడా ఇతర జట్లన్నింటిని ఓడించి టైటిల్ గెలిచే అవకాశం ఉందని ఉందని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. గతేడాది ఆ జట్టు అందరి అంచనాలను తలకిందులు చేసి ట్రోఫి గెలిచిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశాడు. అంతేకాకుండా గత సీజన్లో తాను కూడా ఆ జట్టును తక్కువగా అంచనా వేసినట్లు పీటర్సన్ చెప్పాడు. ప్రస్తుతం ఆ జట్టులో యువ రక్తం పారుతోందని, సరైన నిర్ణయాలు తీసుకునే ఆటగాళ్లున్నారని తెలిపాడు. టీ20ల్లో పరిస్థితులకు తగ్గట్టు అప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అలాంటి వారే విజేతలుగా నిలుస్తారని పీటర్సన్ చెప్పాడు.

సీఎస్కే కెప్టెన్‌గా జడేజా
కాగా ఇటీవల చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని తప్పుకోని ఆ బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో జడేజా టీంను ఎలా నడపించబోతున్నాడనే ఆసక్తి అందరిలో నెలకొంది. టీ20 క్రికెట్‌లో కావాల్సినంత అనుభవం ఉండడం జడేజాకు కలిసి రానుంది. దీనికి తోడు ధోని కెప్టెన్‌గా తప్పుకున్నప్పటికీ సాధారణ ఆటగాడిగా జట్టులో కొనసాగనున్నాడు. దీంతో కష్ట సమయంలో జడేజాకు ధోని ఉండనుంది. దీంతో అతనికి అతి పెద్ద బలంగా మారే అవకాశం ఉంది.


చెన్నైసూపర్ కింగ్స్ పూర్తి జట్టు 2022
మహేంద్ర సింగ్ ధోనీ (12 కోట్లు), రవీంద్ర జడేజా(16 కోట్లు), మొయిన్ అలీ 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్( 6 కోట్లు), దీపక్ చాహర్( 14 కోట్లు), అంబటి రాయుడు(6.75 కోట్లు), డ్వేన్ బ్రావో (ఓవర్సీస్-4.40 కోట్లు), శివమ్ దూబే( 4 కోట్లు), క్రిస్ జొర్డాన్( 3.60 కోట్లు), రాబిన్ ఉతప్ప(2 కోట్లు), మిచెల్ సాంట్నర్ (ఓవర్సీస్ 1.90కోట్లు), ఆడమ్ మిల్నే (ఓవర్సీస్- 1.90 కోట్లు), విక్రమ్ సోలంకి(1.20 కోట్లు), రాజ్‌వర్థన్(1.50 కోట్లు), డేవన్ కాన్వే (ఓవర్సీస్- రూ. కోటి), మహీష్ తీక్షణ (ఓవర్సీస్ 70 లక్షలు), ప్రిటోరియస్ (ఓవర్సీస్ 50 లక్షలు), కేఎమ్ అసిఫ్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, శుభ్రాన్ష్ సేనాపతి, ముకేశ్ చౌధరి, జగదీశన్, హరి నిషాంత్( వీరందరికీ 20 లక్షలు)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications