Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీపై దిగ్గ‌జ ఆట‌గాడు చాపెల్ ప్రశంస‌లు.. రూట్ బ‌ల‌హీన కెప్టెన్ అని వ్యాఖ్య‌

Former cricketer Ian Chappell has praised Virat Kohli

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ ఇయాన్ చాపెల్ ప్ర‌శంస‌లు కురిపించాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌తో పోలుస్తూ భారత జట్టును ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన అసాధారణ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అంటూ కొనియాడాడు. అదే స‌మ‌యంలో ఇంగ్లండ్ కెప్టెన్‌ జో రూట్‌ను చాపెల్ ఒక బ‌ల‌హీన‌మైన కెప్టెన్‌గా అభివ‌ర్ణించాడు. కానీ రూట్ మంచి బ్యాట‌ర్ అంటూ చాపెల్ కొనియాడాడు.

కోహ్లీపై ప్ర‌శంస‌లు

కోహ్లీపై ప్ర‌శంస‌లు

టీమిండియాకు కోహ్లీ విజ‌యవంత‌మైన కెప్టెన్ అని చాపెల్ ప్ర‌శంసించాడు. మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీల వారసత్వాన్ని కోహ్లీ ముందుకు తీసుకెళ్లిన విధానం అభినందనీయమన్నాడు. 2015లో ధోని నుంచి కోహ్లీ కెప్టెన్సీ తీసుకున్న‌ప్పుడు అంద‌రినీ ఒక విష‌యం ఆందోళ‌న‌కు గురి చేసింద‌ని చాపెల్ గుర్తు చేశాడు. ఈ ఆంధోళ‌న‌కు కోహ్లీకి ఉన్న అమిత‌మైన దూకుడే కార‌ణ‌మ‌ని తెలిపాడు. కానీ ఆ త‌ర్వాత కోహ్లీ జ‌ట్టును విజ‌య‌ప‌థంలో న‌డిపించాడ‌ని, అత్యుత్త‌న్న‌త స్థాయికి తీసుకెళ్లాడని చాపెల్ కొనియాడాడు. అదే స‌మ‌యంలో త‌న దూకుడును కూడా త‌గ్గించుకోలేద‌ని చెప్పాడు. గ‌తంలో ఏ కెప్టెన్ సాధించ‌లేని విధంగా వైస్ కెప్టెన్ అజింక్యా ర‌హానేతో క‌లిసి విదేశాల్లో టీమిండియాను విజ‌య‌తీరాల‌కు చేర్చాడ‌ని చాపెల్ ప్ర‌శంసించాడు.

ఆ విజ‌యాలు కోహ్లీ కెరీర్‌లో అత్యుత్త‌మ‌మైన‌వి

ఆ విజ‌యాలు కోహ్లీ కెరీర్‌లో అత్యుత్త‌మ‌మైన‌వి

కోహ్లీ కెప్టెన్సీలో 2018-19లో ఆస్ట్రేలియాలో టీమిండియా టెస్ట్ సిరీస్ విజ‌యం, 2021లో ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్‌లో అధిక్యంలో నిల‌వ‌డం వంటి విజ‌యాలు కోహ్లీ కెరీర్‌లో అత్యుత్త‌మ‌మైన‌వ‌ని ఇయాన్ చాపెల్ అన్నాడు. ఇక స్వ‌దేశంలో టీమిండియాకు ఎలాగో ఎదురులేద‌ని చెప్పాడు. అయితే సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచిన‌ప్ప‌టికీ సిరీస్ కోల్పోవ‌డం కోహ్లీని తీవ్రంగా నిరాశ‌కు గురి చేసింద‌ని చెప్పాడు. అందుకే కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాడ‌న్నాడు. ఆట‌గాళ్ల‌లో టెస్ట్ క్రికెట్‌లో రాణించాల‌నే ఆస‌క్తి పెంచ‌డం కోహ్లీకున్న గొప్ప‌ విశేషంగా చెప్పుకొచ్చాడు. కోహ్లీకి టెస్ట్ క్రికెట్‌లో రాణించాల‌నే కోరిక బ‌లంగా ఉంటుంద‌ని అన్నాడు. రిష‌బ్ పంత్ వంటి ప్లేయ‌ర్‌కు మ‌ద్ద‌తుగా నిలిచి, అత‌డిని బ్యాట‌ర్‌గా, వికెట్ కీప‌ర్‌గా విరాట్ కోహ్లీ అద్భుతంగా తీర్చిదిద్దాడ‌ని ఇయాన్ చాపెల్ కొనియాడాడు.

Virat Kohli టఫ్‌ ఫేజ్‌.. జట్టులో చోటు కష్టం అంటూ వార్నింగ్ Captaincy వదిలేసినా ? | Oneindia Telugu
రూట్ విఫ‌లం

రూట్ విఫ‌లం

అదే స‌మ‌యంలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ బ్యాట‌ర్‌గా రాణించిన‌ప్ప‌టికీ నాయ‌కుడిగా విఫ‌ల‌మ‌య్యాడ‌ని ఇయాన్ చాపెల్ అన్నాడు. ముఖ్యంగా అత‌నికి ఇత‌ర కెప్టెన్ల కంటే ఎక్కువ మ్యాచ్‌ల‌కు కెప్టెన్సీ చేసే అవ‌కాశం వ‌చ్చిన‌ప్ప‌టికీ విజ‌యవంతం కాలేక‌పోయాడ‌ని చెప్పుకొచ్చాడు. జోరూట్ మంచి బ్యాట‌ర్ అని, కానీ ఒక బ‌ల‌హీన కెప్టెన్ అని చాపెల్ అన్నాడు. కాగా టెస్ట్ క్రికెట్‌లో టీమిండియాకు అత్య‌ధిక విజ‌యాలు అందించిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. మొత్తంగా 68 టెస్ట్ మ్యాచ్‌ల్లో నాయ‌క‌త్వం వ‌హించిన కోహ్లీ 40 మ్యాచ్‌ల్లో జ‌ట్టుకు విజ‌యాలు అందించాడు. అంతేకాకుండా విదేశాల్లో టెస్ట్ క్రికెట్‌లో భార‌త జ‌ట్టుకు అత్య‌ధిక విజ‌యాలు అందించిన కెప్టెన్‌గా నిలిచాడు.

Story first published: Sunday, January 30, 2022, 19:03 [IST]
Other articles published on Jan 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+