
టీమిండియా దిగ్గజ ఆటగాడు హర్బజన్ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఇటీవల నిర్వహించిన కోవిడ్ టెస్టుల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్దారణ అయింది. కాగా ప్రస్తుతం హర్బజన్ సింగ్ హోంఐసోలేషన్‌లో చికిత్స పొందతున్నారు. భజ్జీకి స్వల్ప కరోనా లక్షణాలు కూడా ఉన్నాయి. తనకు కరోనా సోకిన విషయాన్ని హర్బజన్ సింగే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియచేశారు. "నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తేలికపాటి లక్షణాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నేను హోంఐసోలేషన్‌లో ఉన్నాను. తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాను. కాగా ఇటీవల నన్ను కలిసిన వారంతా వీలైనంత త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. దయచేసి అందరూ సురక్షితంగా ఉంటూ జాగ్రత్త వహించండి." అని భజ్జీ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు.
కాగా 41 ఏళ్ల హర్బజన్ సింగ్ గత ఏడాది చివర్లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. 1998లో మహ్మద్ అజారుద్దీన్ నాయకత్వంలో హర్బజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేంట్రం చేశారు. 2001 నుంచి 2005 మధ్య సౌరవ్ గంగూలీ నాయకత్వంలో భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగాడు. వన్డేలు, టెస్టుల్లో కలిపి గంగూలీ నాయకత్వంలో 118 మ్యాచ్‌లు ఆడిన భజ్జీ 29 సగటుతో 273 వికెట్లు తీశాడు. ఇక 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భజ్జీ 32 వికెట్లతో విశ్వరూపం చూపించాడు. మహేంద్రసింగ్ ధోని నాయకత్వంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత జట్టు గెలవడంలో భజ్జీ కూడా కీలక పాత్ర పోషించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ధోని కెప్టెన్సీలో 133 మ్యాచ్‌లు ఆడి 229 వికెట్లు తీశాడు.
తన అంతర్జాతీయ కెరీర్ మొత్తంలో హర్బజన్ సింగ్ 711 వికెట్లతో సత్త చాటాడు. ఇందులో 103 టెస్టుల్లో 417 వికెట్లు తీశాడు. ఓ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 8 వికెట్లు తీయగా.. మ్యాచ్‌లో 15 వికెట్లు తీశాడు. అలాగే 236 వన్డే మ్యాచ్‌ల్లో 269 వికెట్లు తీశాడు. ఓ మ్యాచ్‌లో అత్యధికంగా 5 వికెట్లు తీశాడు. ఇక 28 టీ20 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు తీశాడు. అత్యుత్తమ బౌలింగ్ 4-12. ఇక ఐపీఎల్‌లో 163 మ్యాచ్‌లాడి 150 వికెట్లు తీశాడు. అత్యుత్తమ బౌలింగ్ 5/18. ఐపీఎల్‌లో హర్బజన్ సింగ్ ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఐదో సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించగా.. ఆ సీజన్‌లో ముంబై ప్లేఆఫ్స్ చేరుకుంది.