Ind Vs Pak: అతని బౌలింగ్‍లో ఔటవకుండా ఉండడం కాదు.. పరుగులు చేయాలంటున్న గంభీర్..

భారత్, పాక్ మ్యాచ్ అంటే యావత్ క్రీడా ప్రపంచానికి ఆసక్తిగా ఉంటుంది. ముఖ్యంగా భారత్, పాక్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ నెల 23న మెల్ బోర్న్ లో భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి ఇప్పటికే 90 వేలకు పైగా టికెట్ల అమ్ముడు పోయాయని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. టికెట్ల కొనుగోలున బట్టి తెలుస్తుంది భారత్, పాక్ మ్యాచ్ ఎంత ప్రత్యేకమో..

మాటల యుద్ధం
అయితే భారత్, పాక్ మ్యాచ్ కు మందు ఇరుదేశాల మాజీ క్రికటర్లు మాటల యుద్ధం మొదలు పెడుతుంటారు. కొందరు మాజీ ఆటగాళ్లు తమ దేశ జట్టు సభ్యులకు ఎలా ఆడాలో సలహా ఇస్తుంటారు. ఈ విధంగా మాజీ భారత్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ టీమిండియా ఆటగాళ్లకు పలు సూచనలు చేశాడు. అతను పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిదీ గురించి మాట్లాడారు.

ఒత్తిడి పెరుగుతుంది
షహీన్ షా అఫ్రిది బౌలింగ్ లో ఔట్ కాకుండా ఉండాలని చూడకండి.. అతని ఓవర్ లో పరుగులు చేయడానికి ప్రయత్నించండని అని భారత బ్యాటర్లకు సూచించాడు గంభీర్. షాహీన్ అఫ్రిదీ బౌలింగ్ లో ఔట కాకుండా ఉండాలని చూస్తే ఒత్తిడి పెరుగుతుందని స్టార్ స్పోర్ట్స్‌లో గౌతమ్ గంభీర్ అన్నాడు.

తెలివిగా ఆడాలి
"అతను కొత్త బంతితో ప్రమాదకరంగా ఉంటాడని నాకు తెలుసు.. అయినా భారత బ్యాటర్లు ఎక్కువ పరుగులు సాధించాలి, మెరుగైన స్థానాల్లోకి రావాలి. బంతులను కొట్టడం కంటే సమయం చూసుకోవాలి. షహీన్ షా ఆఫ్రిదిని ఖచ్చితంగా ఎదుర్కోగల టాప్ 4లో ఉన్నారు" అని చెప్పాడు. "చూడండి, ఒక విషయం స్పష్టంగా ఉంది. మీరు MCGలో ఆడుతున్నప్పుడు, స్ట్రెయిట్ బౌండరీలు పెద్దగా ఉండవని మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. సైడ్ బౌండరీలు భారీగా ఉంటాయని.. భారత్ తెలివిగా ఉండాలని హెచ్చరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications