Gautam Gambhir: ఆ గొడవతో 2 నెలలు సస్పెండ్ అయ్యా.. నేను చేసిన పనికి ఆయన ఏడ్చారు

టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆటలోనైనా, రాజకీయాల్లోనైనా గౌతీ ముక్కు సూటి తనంగా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో గంభీర్ పలుమార్లు వివాదాల పాలు కూడా అయ్యాడు. అయితే ఈ నేపథ్యంలో తన స్కూల్ క్రికెట్‌లో జరిగిన ఓ గొడవ కారణంగా తాను సస్పెన్షన్‌కు గురవడంతోపాటు తాను చేసిన ఓ పనికి ఒక ఇంటి యజమాని బోరును విలపించాడని గౌతం గంభీర్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

2 నెలలు సస్పెండ్ చేశారు
తాను చదువుకునే రోజుల్లో స్కూళ్లో చాలా గొడవలు పడేవాడినన గౌతం గంభీర్ చెప్పాడు. అలా తాను 12వ తరగతి చదివే రోజుల్లో ఓ టోర్నమెంట్లో భాగంగా క్రికెట్ ఆడడానికి వేరే కళాశాలకు వెళ్లినట్లు తెలిపాడు. అయితే ఆ టోర్నమెంట్లో ప్రత్యర్థి జట్టుతో జరిగిన గొడవ కారణంగా తనను 2 నెలలపాటు సస్పెండ్ చేసినట్లు గంభీర్ గుర్తు చేసుకున్నాడు. సస్పెండ్ చేయడమే కాకుండా అంతకుముందు తనకు ఇచ్చిన అత్యుత్తమ విద్యార్థి బ్యాడ్జ్‌ను కూడా వెనక్కి తీసుకున్నట్లు చెప్పాడు.

నేను చేసిన పనికి ఆయన బోరున విలపించారు
ఇక కళాశాల చివరి రోజుల్లో ఏ విద్యార్థి అయినా క్లాస్‌లకు రెగ్యూలర్‌గా వెళ్లాలనుకుంటాడని, కానీ తాను మాత్రం సస్పెండై ఇంట్లో కూర్చున్నానని గౌతం గంభీర్ చెప్పుకొచ్చాడు. తాను ఇక క్లాస్‌లకు హాజరు కాలేకపోయానని, నేరుగా బోర్డు పరీక్షలకే హాజరైనట్లు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. అదే సమయంలో తాను రంజీ క్రికెట్ కూడా ఆడినట్లు చెప్పాడు. అలాగే ఒమన్ హౌజ్ అనే ఓ పెద్ద బంగ్లాలోని అద్భుతమైన చిత్ర పటాన్ని నాశనం చేసినట్లు తెలిపాడు.
ఆ చిత్ర పటాన్ని ఆ ఇంటి యజమాని ఒమన్ నుంచి తెప్పించినట్లు ఆయన చెప్పాడు. తాను ఆ చిత్రపటాన్ని నాశనం చేయడం చూసి సదరు యజమాని బోరున విలపించినట్లు తెలిపాడు. అయితే అది ఎంత పెద్ద తప్పో తనకు ఇప్పుడు తెలిసి వచ్చిందని గౌతం గంభీర్ చెప్పాడు. దీనిని బట్టి గంభీర్ చిన్నతనంలోనూ చాలా దూకుడుగా ఉండేవాడని అర్థమవుతుంది.

లక్నో మెంటార్‌గా
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన గౌతం గంభీర్ రానున్న ఐపీఎల్ సీజన్లో కొత్త జట్టు లక్నోసూపర్ జెయింట్స్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో గౌతం గంభీర్ కీలక పాత్ర పోషించాడు. కాగా ఐపీఎల్‌లో కెప్టెన్‌గా గౌతం గంభీర్ కోల్‌కతానైట్ రైడర్స్‌కు రెండు టైటిళ్లు అందించిన సంగతి తెలిసిందే.

లక్నో సూపర్ జెయింట్స్ పూర్తి జట్టు
కేఎల్ రాహుల్ (17 కోట్లు), మార్కస్ స్టొయినిస్ (9.2 కోట్లు), రవి బిష్ణోయ్ (4 కోట్లు), అవేశ్ ఖాన్ (10 కోట్లు), జాసన్ హోల్డర్ (8.75 కోట్లు), కృనాల్ పాండ్య (8.25 కోట్లు), మార్క్ వుడ్ (7.50 కోట్లు), క్వింటన్ డికాక్ ( 6.75 కోట్లు), దీపక్ హుడా (5.75 కోట్లు), మనీశ్ పాండే (4.60 కోట్లు), దుష్మాంత చమీరా (2 కోట్లు), ఎవిన్ లూయిస్ ( 2 కోట్లు), కృష్ణప్ప గౌతమ్ (90 లక్షలు), అంకిత్ సింగ్ రాజ్‌పుత్ (50 లక్షలు), షాబాజ్ నదీమ్ (50 లక్షలు), కేల్ మయేర్స్ (50 లక్షలు), మనన్ వోహ్రా, ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మోన్‌సిన్ ఖాన్( వీరందరికీ 20 లక్షలు).
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications