INDvsNZ: ఏ గ్రహం నుంచి వచ్చాడో ఏమో?.. టీమిండియా స్టార్ బ్యాటింగ్ చూసి నోరెళ్లబెట్టిన మాజీ దిగ్గజం!

టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతని బ్యాటింగ్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యపోవడం ఖాయం. కొన్ని కొన్ని షాట్లు సూర్యకుమార్ ఎలా కొడతాడో కూడా ఎవరికీ అర్థం కాదు. అదే విషయాన్ని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా కూడా బల్లగుద్ది మరీ చెప్పాడు. సూర్య బ్యాటింగ్ చూస్తుంటే అతను ఏ గ్రహం నుంచి వచ్చాడో కూడా ఒక్కోసారి అర్థం కాదన్నాడు.

కివీస్ సిరీస్‌లో..
న్యూజిల్యాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. రెండో మ్యాచ్‌లో కేవలం 51 బంతుల్లోనే 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో అతను కొట్టిన కొన్ని షాట్లు చూసి ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా నోరెళ్లబెట్టారు. ఆ తర్వాత జరిగిన మూడో మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. పది బంతులు ఎదుర్కొని 13 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే మొత్తం సిరీస్‌లో 124 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు కూడా అందుకున్నాడు.

గ్రహాంతరవాసే..
సూర్యకుమార్ గురించి తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన ఆకాష్ చోప్రా.. 'ఈ సూర్యకుమార్ అనే ఆటగాడు అసలు ఏ గ్రహం నుంచి వచ్చాడో తెలియడం లేదు. తను అదో రకంగా, కొత్తగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాంటి ఆటతీరు చూస్తే మన మనసులో ముందుగా వచ్చే అనుమానం.. అసలు అది సాధ్యమేనా? అని' అని చెప్పాడు. అంత అద్భుతమైన స్ట్రైక్ రేటుతో అంత నిలకడగా ఆడటం అసలు సాధ్యమేనా? అని చోప్రా ప్రశ్నించాడు. కివీస్ సిరీస్‌లో భారత్‌లో కనిపించిన అతిపెద్ద పాజిటివ్ అంశం సూర్య బ్యాటింగ్ అని కొనియాడాడు.

ఫామ్ పోతే..?
సూర్యలా బ్యాటింగ్ చేయడం అసాధ్యమన్న చోప్రా.. రెండో టీ20లో యార్కర్‌ను అతను స్కూప్ చేసి సిక్సర్ పంపడం చూసి, అసలు ఎవరైనా అతనికి ఎలా బౌలింగ్ చేయాలని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అన్నాడు. 'ప్రస్తుతం ఈ ప్రశ్న అడక్కూడదు కానీ.. అతను ఆడుతున్న స్టైల్ చూస్తుంటే ఏదో ఒక సమయంలో ఫామ్ పోయే పరిస్థితి వస్తుంది. ఇలా కూడా క్రికెట్ ఆడొచ్చు.. ఇలా ఆడినా కూడా రాణించొచ్చు అని చెప్తున్నాడు.
అందుకే అతను ఒకవేళ ఫామ్ కోల్పోయినా అది ఎక్కువ కాలం ఉండకూడదని కోరుకుంటున్నా' అని చోప్రా అన్నాడు. సూర్య ఎక్కువగా రిస్క్ ఉండే ఆట ఆడతాడని, అలాగే ఎక్కువగా కన్ను-చెయ్యి సమన్వయంపై ఫోకస్ చేస్తాడని చోప్రా చెప్పాడు. ఈ కారణంగానే అతను ఒకవేళ ఫామ్ పోయినా ఎక్కువ కాలం అలా ఉండిపోడని వివరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications