Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsNZ : పుల్ షాట్ ఆడలేక అవుటవుతున్న గిల్.. మరీ ఇంత చెత్త రికార్డా?

Former Cricketer critisizes Shubman Gill before third INDvsNZ T20I

కివీస్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఏమాత్రం రాణించడం లేదు. రెండో టీ20లో కూడా గిల్ పెద్దగా ఆకట్టుకోలేదు. మొత్తం 9 బంతుల్లో 11 పరుగులు చేసి అవుటయ్యాడు. తొలి టీ20లో కూడా గిల్ పెద్దగా ఆడలేదు. మిచెల్ శాంట్నర్ వేసిన బంతిని పుల్ చేయబోయి విఫలమయ్యాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతిని ఫీల్డర్ సులభంగా క్యాచ్ పట్టేశాడు. ఇక రెండో మ్యాచ్‌లో కూడా బ్రేస్‌వెల్ వేసిన బంతిని పుల్ చేయబోయి అవుటయ్యాడు.

శాంట్నర్ సూపర్ కెప్టెన్సీ

శాంట్నర్ సూపర్ కెప్టెన్సీ

అతను అవుటైన విధానాన్ని తప్పు బట్టడం సరికాదని అన్న మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా.. కానీ అతని ఆటతీరు మాత్రం పెద్దగా ఆకట్టుకోవడం లేదని తేల్చేశాడు. 'ఇదేం సింపుల్, స్ట్రెయిట్ ఛేజ్ కాదు. మిచెల్ శాంట్నర్ కెప్టెన్సీ సూపర్‌గా ఉంది. బౌలర్లను చక్కగా రొటేట్ చేశాడు. గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్ చేత కూడా బౌలింగ్ చేయించాడు. అయితే గిల్ మాత్రం తొలి మ్యాచ్‌లో అవుటైనట్లే అవుట్ అయ్యాడు' అని చెప్పాడు. అయితే గిల్ అవుటైన విధానాన్ని తప్పుబట్టలేమన్న అతను.. డిసప్పాయింట్ అయినట్లు వివరించాడు.

సేమ్ టూ సేమ్ అవుట్!

సేమ్ టూ సేమ్ అవుట్!

'గిల్ చివరి మ్యాచ్‌లో కూడా అలాగే అవుటయ్యాడు. శాంట్నర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో మైకేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో కూడా అచ్చం అలాగే అవుటయ్యాడు. తను పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి ఫెయిల్ అవుతున్నాడు. బంతి లీడింగ్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేవడం, దాన్ని ఫీల్డర్ పట్టేయడం జరిగింది రెండు మ్యాచుల్లో. అది కూడా టర్నింగ్ పిచ్‌లో జరిగింది. ఈ విషయంలో అతన్ని విమర్శించడం కరెక్ట్ కాదనే మాట వాస్తవమే. కానీ అతని గణాంకాలు మాత్రం అంత గొప్పగా లేవు. అదే పెద్ద సమస్య' అని విశ్లేషించాడు.

గిల్ చెత్త రికార్డు

గిల్ చెత్త రికార్డు

శుభ్‌మన్ గిల్ ఇప్పటి వరకు ఐదు టీ20లు ఆడాడు. వీటిలో కేవలం 15.20 సగటుతో 76 పరుగులు మాత్రమే చేశాడు. ఇంత చెత్త రికార్డు చూసిన చాలా మంది అతని స్థానంలో పృథ్వీ షాను ఆడించాలని అంటున్నారు. అయితే లక్నో పిచ్‌పై ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ కూడా తడబడ్డాడనే విషయాన్ని ఆకాష్ చోప్రా గుర్తుచేశాడు. 'ఇషాన్ కిషన్ డీసెంట్‌గా ఆడుతున్నట్లే కనిపించినా రనౌట్ అయిపోయాడు. రాహుల్ త్రిపాఠీ భారీ షాట్ ఆడబోయి అవుటయ్యాడు. అసలు ఈ పిచ్‌పై ఎన్ని పరుగులు చేస్తాం? అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ కూడా ఇక్కడ చాలా కష్టపడ్డాడు కదా' అని వివరించాడు.

Story first published: Monday, January 30, 2023, 15:15 [IST]
Other articles published on Jan 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+