INDvENG: సెమీస్‌లో ఆ ఇద్దరిపైనే ఫోకస్.. టాస్ ఓడితే మ్యాచ్ ఓడినట్లేనా?

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ చివరి దశకు చేరింది. తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిల్యాండ్‌ను ఓడించిన పాకిస్తాన్ ఇప్పటికే ఫైనల్ చేరింది. గురువారం నాడు జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో తలపడేందుకు ఇంగ్లండ్, భారత్ సిద్ధం అవుతున్నాయి. వీటిలో గెలిచిన జట్టు నవంబరు 13న మెల్‌బోర్న్ వేదికగా జరిగే ఫైనల్‌లో పాక్‌ను ఢీకొంటుంది.

సెమీస్ పోరుపై ఉత్కంఠ
సూపర్12 దశలో భారత్, ఇంగ్లండ్ రెండు జట్లు అద్భుతంగా రాణించాయి. రెండూ బలమైన జట్లే కావడంతో ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ ఆడతాయని ఇప్పటికే పలువురు మాజీలు అంచనాలు కూడా వేశారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా కూడా ఈ మ్యాచ్ గురించి తన యూట్యూబ్ ఛానెల్‌లో విశ్లేషించాడు.

విరాట్, బట్లర్‌పై అంచనాలు
అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఇద్దరూ రాణిస్తారని ఆకాష్ అభిప్రాయపడ్డాడు. వీళ్లపై ఉన్న అంచనాలను అందుకుంటారన్న ఆకాష్.. 'ఇద్దరూ కలిసి కనీసం 80పైగా పరుగులు చేస్తారు. ముందుగా బ్యాటింగ్ చేస్తే బట్లర్ ఒక్కడే కూడా 80పైగా పరుగులు చేయొచ్చు. కోహ్లీ కూడా ఈ మ్యాచ్‌లో కచ్చితంగా రాణిస్తాడు' అని తెలిపాడు. అడిలైడ్‌లో కోహ్లీ రికార్డు మెరుగ్గా ఉండటంతో అతనిపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే.

టాస్ కీలకం కాదు..
ఈ మైదానంలో జరిగిన ఆరు మ్యాచుల్లో కేవలం రెండిట్లో మాత్రమే ఛేజింగ్ జట్టు గెలిచింది. అందుకే టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటుందని క్రికెట్ పండితులు చెప్తున్నారు. అయితే ఆకాష్ చోప్రా దీనికి భిన్నమైన సమాధానం చెప్పాడు. రోహిత్ టాస్ ఓడినా ఫీలవ్వాల్సిన అవసరం లేదన్న చోప్రా.. ఈ మ్యాచ్‌లో ఛేజింగ్ చేసే జట్టే గెలుస్తుందని జోస్యం చెప్పాడు. అంతేకాదు ఇంగ్లండ్ జట్టు పవర్‌ప్లేలో ఓవర్‌కు తొమ్మిది పరుగుల వరకు చేస్తుందని, మ్యాచ్‌లో కనీసం 12 పైగా సిక్సర్లు నమోదవుతాయని అంచనా వేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications