
ఆసియా కప్ 2023లో పాల్గొనడానికి భారత్ పాకిస్థాన్ కు వెళ్లదని.. అందుకే ఆసియా కప్ ను తటస్థ వేదిలో నిర్వహించాలని బీసీసీఐ కార్యదర్శి జై షా అన్నారు. జై షా వ్యాఖ్యలతో ఇరు దేశాల మాజీ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీనిపై పాక్ మాజీ క్రికెటర్ల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీసీసీఐ నిర్ణయం తర్వాత పీసీబీ ఒక లేఖ విడుదల చేసింది. భారత్ లో జరిగే ODI ప్రపంచ కప్ నుంచి వైదొలగుతామని బెదిరించింది.
తటస్థ వేదికపై ఆసియా కప్
భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాత్రం దీనిపై భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. "భారత్ పాల్గొనకపోతే ఆసియా కప్ జరగకపోవచ్చు. ప్రపంచకప్‌తో పోలిస్తే ఆసియాకప్ చిన్నపాటి టోర్నీ. ప్రపంచ కప్‌ను దాటవేయడం అంటే మీరు ICC (పాల్గొనే దేశాలతో) పంచుకునే భారీ మొత్తంలో ఆదాయాన్ని వదులుకోవడం. పాల్గొనకపోతే పాకిస్థానే నష్టపోతుంది. కాబట్టి పాక్ హెచ్చరికను సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆసియా కప్ 2023 తటస్థ వేదికపై జరుగుతుందని నేను భావిస్తున్నాను" అని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో తెలిపారు.
ACC పెద్ద సోదరుడు
భారతదేశాన్ని 'ACC పెద్ద సోదరుడు' అని పేర్కొన్న చోప్రా, కౌన్సిల్‌లో డబ్బు తీసుకోని ఏకైక సభ్యుడు బీసీసీఐ మాత్రమేనని, బదులుగా దానిని ఇతర బోర్డుల మధ్య పంపిణీ చేస్తుందని పేర్కొన్నాడు. "వాస్తవానికి, ACC ఒక కన్సార్టియం. కానీ భారతదేశం ACC నుండి పైసా తీసుకోదనే విషయం కొందరికి తెలుసు. ప్రతి ఒక్కరూ (ACC) ఖజానా నుంచి కొంత మొత్తాన్ని తీసుకుంటారు. " అని చోప్రా అన్నారు. "ACCలో భారత్ ఒక పెద్దన్న పాత్రను పోషిస్తోందని చెప్పాడు.