Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : సూపర్‌గా ఆడుతున్న జడ్డూ.. కారణం ఏంటో చెప్పిన మాజీ కోచ్!

 Former Coach reveals incident that changed Ravindra Jadeja

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టులో ఎంత కీలకంగా మారాడో తెలిసిందే. ముఖ్యంగా టెస్టుల్లో అతను జట్టును ఒంటి చేత్తో గెలిపిస్తున్నాడు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండు విభాగాల్లో అదరగొడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి రెండు టెస్టుల్లో కూడా జడ్డూ అదరగొట్టాడు. ఈ రెండు టెస్టుల్లో అతనికే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు కూడా అందుకున్నాడు.

ఆ చర్చ తర్వాత జడ్డూ మారాడు..

ఆ చర్చ తర్వాత జడ్డూ మారాడు..

జడేజా ఇంత అద్భుతంగా ఆడటం గురించి మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర విషయం వెల్లడించాడు. అంతకుముందు తను కోచ్‌గా ఉండగా జడ్డూతో ఒకసారి మాట్లాడానని, అప్పటి నుంచే అతని ఆటతీరు మారిందని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా అక్కడే ఉన్నాడని రవిశాస్త్రి చెప్పాడు.

ఈ ఘటన 2019లో జరిగిందని గుర్తుచేసుకున్నాడు. అప్పుడు లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్‌ జరుగుతుండగా.. దానిలో జడ్డూను తీసుకోలేదు. అప్పుడే అతన్ని కూర్చోబెట్టి రవిశాస్త్రి, భరత్ అరుణ్ చాలా సీరియస్‌గా మాట్లాడారట. ఆ చర్చ జడ్డూపై చాలా మంచి పాజిటివ్ ప్రభావం చూపిందని రవిశాస్త్రి చెప్పాడు.

ఆకలి మీద ఉన్నాడు..

ఆకలి మీద ఉన్నాడు..

జడ్డూలో అప్పుడు కాన్ఫిడెన్స్ లేదని, దాన్ని పెంచేందుకే తాము ప్రయత్నించామని వివరించాడు. కొంచెం బ్యాటింగ్‌పై కూడా జడేజా ఫోకస్ పెడితే బాగుంటుందని, అప్పుడే భారత జట్టులో ఆల్‌రౌండర్ కావాలి అంటే అతన్నే తీసుకుంటారని చెప్పారట. 'ఆ సమయంలో జడేజా మంచి ఆకలిగా ఉన్నాడు.

అద్భుతమైన ఫిట్‌నెస్‌ అతని సొంతం. ఆట మీద జడ్డూకు చాలా ప్యాషన్ కూడా ఉంది. అతనితో చాలా సార్లు మాట్లాడాను. కానీ నాకు ఇదే బాగా గుర్తు' అని రవిశాస్త్రి గుర్తుచేసుకున్నాడు. లార్డ్స్‌లో అతన్ని ఆడించలేదన్న రవిశాస్త్రి.. అప్పుడే భరత్ అరుణ్‌తో కలిసి జడ్డూతో మాట్లాడినట్లు చెప్పాడు.

నిన్ను నువ్వు నమ్ము..

నిన్ను నువ్వు నమ్ము..

'నీ దగ్గర అన్నీ ఉన్నాయి. కొంచెం బ్యాటింగ్ మీద కూడా ఫోకస్ పెట్టు. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ కొంచెం ఎక్కువ చెయ్యి. నీలో మంచి ఆట ఉంది. చాలా ట్యాలెంట్ ఉంది. ఇదంతా నీకు చెప్పాల్సి రావడం ఇబ్బందిగా ఉంది. అసలు నీకే ఇది అర్థం అవ్వాలి. నీలో ట్యాలెంట్ ఉందని ముందు నువ్వు నమ్మాలి' అని మాజీ లెజెండ్ చెప్పాడు. తనలో ఉన్న ట్యాలెంట్‌ను జడ్డూ తెలుసుకునేలా చేయడానికే ప్రయత్నించామన్నాడు.

ఆ తర్వాత కూడా కొన్ని టూర్స్‌ మిస్సవడంతో జడ్డూ కూడా పట్టుదలగా తన ఆటతీరును మెరుగుపరుచుకున్నాడని శాస్త్రి వెల్లడించాడు. ఇప్పుడు జడేజా భారత్‌లోని బెస్ట్ ఆల్‌రౌండర్లలో ఒకడిగా ఎదగడం తనకు చాలా సంతోషం కలిగిస్తోందని తెలిపాడు.

ఇప్పుడు అదే పెద్ద సమస్య..

ఇప్పుడు అదే పెద్ద సమస్య..

అతనో మ్యాచ్ విన్నర్‌గా మారాడని, జట్టు కూడా అతన్ని అలాగే చూస్తోందని అన్నాడు. 'ఆ తర్వాత అతనికి అవకాశం దక్కింది. ఇక అప్పటి నుంచి వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కఠిన పరిస్థితుల్లో కూడా కీలకమైన పరుగులు చేస్తూ.. అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఆకట్టుకున్నాడు.

ఇప్పుడు విదేశాల్లో ఆడేటప్పుడు ఒక్క స్పిన్నర్‌నే ఆడించాలంటే టీం మేనేజ్‌మెంట్‌కు అదొక పీడకలలా మారింది. అశ్విన్ రికార్డులు చూడండి, ఇప్పుడు జడేజా కూడా ఉన్నాడు. ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలో తెలియక తలబద్దలు కొట్టుకోవాల్సిందే' అని పేర్కొన్నాడు.

Story first published: Monday, February 27, 2023, 15:40 [IST]
Other articles published on Feb 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+