Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : రాహుల్‌కు ట్యాలెంట్ ఉంటే ఏంటి?.. నా ఓటు గిల్‌కే: మాజీ కోచ్

Former coach backs Gill over Rahul

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను జట్టు వైస్ కెప్టెన్‌గా సెలెక్టర్లు తొలగించారు. అతని స్థానంలో ఎవరికీ ఈ బాధ్యతలు అప్పగించలేదు. దీంతో తర్వాతి వైస్ కెప్టెన్ ఎవరనే అంశంపై తెగ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి చాలా బ్లంట్‌గా సమాధానం ఇచ్చాడు. అసలు భారత్‌లో ఆడుతున్నప్పుడు జట్టులో వైస్ కెప్టెన్ ఎందుకని? ఇక్కడ ఆడే పదకొండు మంది బెస్ట్ అవ్వాలని, అంతేకానీ వైస్ కెప్టెన్లు అక్కర్లేదని అన్నాడు.

వైస్ కెప్టెన్ అక్కర్లేదు..

వైస్ కెప్టెన్ అక్కర్లేదు..

'వైస్ కెప్టెన్ ఎవరని టీం మేనేజ్‌మెంట్ నిర్ణయిస్తుంది. వాళ్లకు అతని ఫామ్, మానసిక స్థితి తెలుసు. అలాగే శుభ్‌మన్ గిల్ వంటి వారిని ఎలా చూసుకోవాలో కూడా వాళ్లకు తెలుసు. నా వరకైతే.. భారత్‌కు అసలు ఎప్పుడై వైస్ కెప్టెన్ అక్కర్లేదనే అనుకుంటా. దాని కన్నా బెస్ట్ పదకొండు మందిని ఆడించడం బెటర్. ఒకవేళ కెప్టెన్ కనుక మైదానం వీడాల్సి వస్తే.. అతని స్థానం తీసుకునే ఆటగాడిని ఎంచుకుంటాం అంతే. అది కూడా జట్టులో మరీ అవకతవకలు జరగకుండా చూసుకునేందుకు' అని రవిశాస్త్రి వివరించాడు.

ట్యాలెంట్ ఉంటే సరిపోదు..

ట్యాలెంట్ ఉంటే సరిపోదు..

అలాగే కేఎల్ రాహుల్ మీద కూడా రవిశాస్త్రి తన అభిప్రాయం చెప్పాడు. 'అతనో అద్భుతమైన ఆటగాడు. కానీ ట్యాలెంట్ ఒక్కటే సరిపోదు కదా. దాన్ని ఫలితంగా మార్చాలి. దానికితోడు నిలకడగా రాణించాలి. భారత్‌లో చాలా ట్యాలెంట్ ఉంది. వాళ్లందరూ జట్టులోకి వచ్చేందుకు తలుపులు బాదుతున్నారు. ఒక్క కేఎల్ రాహుల్ మాత్రమే కాదు. మిడిలార్డర్, బౌలింగ్ లైనప్‌లో చాలాా స్థానాల్లో ఇదే పరిస్థితి ఉంది' అని శాస్త్రి చెప్పాడు. రాహుల్ ఫామ్‌లో లేకపోయినా కూడా కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అతనికి మద్దతుగా నిలిచారు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌లో రాహుల్ సెంచరీలు చేశాడని గుర్తుచేశారు.

ఫామ్‌లో ఉన్న గిల్ కావాలి..

ఫామ్‌లో ఉన్న గిల్ కావాలి..

''వైస్ కెప్టెన్ కనుక రాణించకపోతే మరొకరు ఆ స్థానాన్ని తీసుకుంటారు. కనీసం ఆ ట్యాగ్ అక్కడ ఉండదు కదా. నేను చాలా కఠినంగా మాట్లాడతా. అసలు స్వదేశంలో ఆడుతున్నప్పుడు జట్టులో వైస్ కెప్టెన్ ఉండటమే నాకు నచ్చదు. విదేశాల్లో పరిస్థితి వేరు. ఇక్కడ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న వాళ్లే కావాలి. ఇప్పుడు గిల్‌ వంటి వారు కావాలి. అతను దీన్నో సవాలుగా తీసుకోవాలి. తలుపులు బద్దలు కొట్టి జట్టులో తన స్థానాన్ని తీసుకోవాలి' అని తేల్చేశాడు. అలాగే ఇప్పుడు రాహుల్ వైస్ కెప్టెన్ కాదని, అతన్ని పక్కన పెట్టాలా? వద్దా? అనే నిర్ణయం టీం మేనేజ్‌మెంట్ తీసుకుంటుందని చెప్పాడు.

Story first published: Sunday, February 26, 2023, 16:06 [IST]
Other articles published on Feb 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+