
దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ కోసం అలాగే ఇంగ్లాండ్‌తో జరిగే ఏకైక టెస్టు కోసం టీమిండియా స్క్వాడ్‌ను ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక టెస్టు జట్టు సెలక్షన్లో చటేశ్వర్ పుజారాను ఎంపిక చేయడంపై మాజీ చీఫ్ సెలెక్టర్ ఎం ప్రసాద్ స్పందించాడు. ఇక ఫామ్ లేమితో ఉన్న పుజారాను శ్రీలంకతో స్వదేశంలో జరిగిన భారత రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నుంచి తప్పించారు. ఏళ్ల తరబడి టెస్ట్ టీంలో కన్సిస్టెన్సీ ప్లేయర్‌గా ఉన్న తనను తప్పించడాన్ని పుజారా సవాల్ గా తీసుకున్నాడు. తనేంటో నిరూపించుకోవడానికి ఇంగ్లాండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్ షిప్‌లో పాల్గొన్నాడు.
కౌంటీ ఛాంపియన్ షిప్‌లో ససెక్స్ జట్టు తరఫున ఆడిన పుజారా రెండు డబుల్ సెంచరీలు చేసి ఫాంలోకి వచ్చాడు. అలాగే రెండు డబుల్ సెంచరీలతో సహా పుజారా మొత్తం నాలుగు సెంచరీలు చేసి భీకర ఫాంలోకి రావడంతో అతన్ని పక్కన పెట్టేందుకు ఎలాంటి కారణం లేకుండా చేశాడు. ఫలితంగా ఇంగ్లాండ్‌తో జరగబోయే ఏకైకా రీషెడ్యూల్ టెస్ట్ కోసం పుజారా తిరిగి టీమిండియాకు సెలెక్ట్ అయ్యాడు.
ఇక చటేశ్వర్ పుజారా టీమిండియాలోకి తిరిగి ఎంపికవ్వడాన్ని ఎంఎస్కే ప్రసాద్ ప్రశంసిస్తూ.. ఒక్క మాటలో చెప్పలంటే అన్ బిలివుబుల్ కమ్ బ్యాక్ అని పేర్కొన్నాడు. నిజంగా ఇది నమ్మశక్యం కాని పునరాగమనం. క్రికెట్ పట్ల, తనపై తనకు ఉన్న నమ్మకం పట్ల పుజారాకు ఉన్న నిబద్ధత ఏంటో పుజారా ఆట ద్వారా చూపించాడు. ఇదొక అద్భుతమైన పునరాగమనం అని ప్రసాద్ చెప్పాడు. అతను సరైన పనే చేశాడు. ఐపీఎల్, దేశవాళీ టోర్నీల వంక చూడకుండా ప్రతిష్ఠాత్మక కౌంటీ ఛాంపియన్ షిప్‌లో ఆడి సత్తా చాటాడు. కౌంటీ టెస్ట్ ఛాంపియన్ షిప్ సందర్భంగా అతను తనలో ఇమిడి ఉన్న ఫాంను వెలికితీసుకువచ్చాడు.
ఆ ప్రదర్శనే అతన్ని మళ్లీ టీమిండియా టెస్ట్ టీమ్‌లో తీసుకుచ్చిందని భావిస్తున్నా. ముఖ్యంగా మనం అతన్ని ఎక్కువగా టెస్ట్ క్రికెటర్‌గానే చూశాం. అతను లేకుంటే తప్పకుండా టీమిండియాలో ఏదో లోటున్నట్లు కన్పిస్తుంది. ఈసారి టెస్ట్ జట్టులో మళ్లీ అతను ఎంపికవ్వకపోతే మళ్లీ అతను ఎంపికవ్వడం చాలా కష్టమయ్యేది అని ఎంఎస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. నిజంగా అతనికి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇకపోతే రీషెడ్యూల్ టెస్టులోనూ పుజారా రాణించి ఈ టెస్టు సిరీస్‌ని గనుక టీమిండియా గెలిస్తే.. తను ఖచ్చితంగా మరో రెండేళ్ల పాటు టెస్ట్ క్రికెట్ కెరీర్‌ను కలిగి ఉంటాడని నేను భావిస్తున్నాను' అని ఎంఎస్కే అభిప్రాయపడ్డాడు.