'ధోనీ పునరాగమనం ఐపీఎల్‌పై ఆధారపడి ఉంది.. టీమిండియాలో తప్పక ఉంటాడు'

బెంగళూరు: టీమిండియా సీమజి కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ పునరాగమనం ఐపీఎల్‌పై ఆధారపడి ఉంది. టీ20 ప్రపంచకప్‌కు ధోనీ సేవలు అవసరమని జట్టు భావిస్తే.. అతడు టీమిండియాలో తప్పక ఉంటాడు అని భారత మాజీ కెప్టెన్, దిగ్గజం అనిల్ కుంబ్లే అన్నారు. ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఆల్‌రౌండర్ల కంటే వికెట్లు తీసే సత్తా ఉన్న బౌలర్లపై టీమిండియా దృష్టి పెట్టాలని సూచించారు.

ఐపీఎల్‌పై ఆధారపడి ఉంది:
తాజాగా అనిల్ కుంబ్లే మాట్లాడుతూ... 'ఐపీఎల్‌లో ధోనీ ఎలా ఆడుతాడో చూడాలి. మహీ పునరాగమనం ఐపీఎల్‌పై ఆధారపడి ఉంది. టీ20 ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతోంది కాబట్టి మహీ సేవలు అవసరమని జట్టు భావిస్తే టీమిండియాలో తప్పక ఉంటాడు. అయితే దీని కోసం మనం వేచి చూడాలి' అని పేర్కొన్నారు. ప్రపంచకప్ 2019 ముగిసినప్పటి నుండి ధోనీ విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో ధోనీ చివరిసారిగా ఆడాడు.

అత్యుత్తమ ఆటగాడు రోహిత్:
'కేఎల్ రాహుల్ బాగా ఆడుతున్నాడు. టీ20 ఫార్మాట్‌లో అద్భుతమైన ఆటగాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడని అనుకుంటున్నా. రాహుల్‌ను బ్యాకప్ వికెట్ కీపర్‌గా భావిస్తే ప్రపంచకప్‌కు ముందు 10-12 మ్యాచుల్లో ఆడించాలి. నా వరకు ఈ ఏడాది భారత క్రికెటర్లలో అత్యుత్తమ ఆటగాడు రోహిత్ శర్మనే. 2019లో అన్ని ఫార్మాట్లలో పరుగులు సాధించాడు. అత్యుత్తమ ఆటగాడు మయాంక్ అగర్వాల్' అని కుంబ్లే అన్నారు.

మణికట్టు స్పిన్నర్లు కీలకం:
టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్ల కంటే వికెట్లు తీసే సత్తా ఉన్న బౌలర్లపై టీమిండియా యాజమాన్యం దృష్టి పెట్టాలని కుంబ్లే సూచించారు. 'వికెట్ల తీయగల సత్తా ఉన్న మణికట్టు స్పిన్నర్లు కుల్‌దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ జట్టులో ఉండాలని అనుకుంటున్నా. మంచు ప్రభావిత సమయంలో ఈ ఇద్దరు రాణించగలరు' అని జంబో తెలిపారు.

వికెట్లపై దృష్టి పెట్టాలి:
'ప్రతి ఒక్క బౌలర్ మ్యాచ్‌లో ప్రత్యర్థుల వికెట్లపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఆల్‌రౌండర్ల కంటే వికెట్ల తీసే ఫాస్ట్ బౌలర్లను జట్టులో తీసుకోవాలి. ఇది కీలక అంశం. ఆస్ట్రేలియా పిచ్‌ల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుండే జట్టును సిద్ధం చేసుకోవాలి. ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకువచ్చే బౌలర్లను ఎంపిక చేయాలి' అని కుంబ్లే చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications