Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పెళ్లిపీటలు ఎక్కబోతున్నఇండియన్ క్రికెటర్

 Former Bigg Boss contestant N C Aiyappa gets engaged to Anu Poovamma

హైదరాబాద్: మరో భారత క్రికెటర్ పెళ్లికొడుకు కాబోతున్నాడు. రంజీ ఆటగాడైన ఎన్‌సీ అయ్యప్ప.. కర్ణాటక సినీ నటి అనూ పూవమ్మను వివాహమాడేందుకు సిద్ధమయ్యాడు. బెంగళూరులోని వసంతపుర వేదికగా వీరిద్దరి నిశ్చితార్థ వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు బంధువుల సమక్షంలో కార్యక్రమం జరిగినట్లు బంధువుల్లో ఒకరు వెల్లడించారు. వివాహం వచ్చే ఏడాది చేయనున్నట్లు వారు వెల్లడించారు.

సాధారణంగానే సెలబ్రిటీల వేడుక అంటే మీడియా కళ్లన్నీ అటువైపే ఉంటాయి. కానీ, వారు హంగూ ఆర్భాటాలకు పోకుండా సాధారణంగానే వేడుకను ముగించేశారట. వచ్చే ఏడాది విరాజ్‌పేట్‌లో వీరిద్దరూ ఒకటి కాబోతున్నారు.

అయ్యప్ప కర్ణాటక తరపున రంజీ ట్రోఫీల్లో ఆడాడు. ఇప్పటి వరకూ 32 మ్యాచ్‌లలో ఆడిన అయ్యప్ప 2001లో ఫస్ట్ క్లాస్ డెబ్యూట్ చేయగలిగాడు. ఇతనికి కన్నడ సినీ పరిశ్రమతో మంచి సంబంధాలే ఉన్నాయి. కన్నడ సినీ నటి ప్రేమ సోదరుడైన అయ్యప్ప కన్నడ భాషలో కిచ్చ సుదీప్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3లోనూ పాల్గొన్నాడు. ఈ షో ద్వారా అయ్యప్పకు అతనితో పాటు షోలో పాల్గొన్న పూజా గాంధీకి మధ్య డేటింగ్ నడిచినట్లు అప్పట్లో రూమర్లు కూడా వ్యాపించాయి.

అనూ పూవమ్మ తన సినీ కెరీర్‌లో కర్వ, కథాచరిత్ర, లైఫ్ సూపర్ అండ్ పానీ పూరీ చిత్రాల్లో నటించారు. ఆమె ప్రస్తుతం ప్రతి రోజు ప్రసారమవుతోన్న ముద్దు లక్ష్మీ అనే కార్యక్రమంలో నెగిటివ్ పాత్రలో కనిపిస్తుంది. ఇందులో ఆమె మిస్ ఇండియాకి పోటీ చేస్తున్న ఐశ్యర్యలా నటిస్తోంది.

Story first published: Friday, May 18, 2018, 17:48 [IST]
Other articles published on May 18, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+