Madan Lal: రిషబ్ పంత్‌కు ఇంకా అంతా మెచురిటీ రాలేదు..ఫస్ట్ బ్యాటింగ్ సరిగా చేసుకుంటే తర్వాత చూద్దాం

దక్షిణాఫ్రికా సిరీస్లో భారత జట్టు కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను నియమించడం సాహసోపేతమైన చర్యగానే చాలా మంది విశ్లేషించారు. ఇండియా vs దక్షిణాఫ్రికా టీ20I సిరీస్ ప్రారంభానికి ఒక్క రోజు ముందు అనూహ్యంగా పంత్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో గజ్జలో గాయం కారణంగా కేఎల్ రాహుల్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇక అతని స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రిషబ్ పంత్ సారథ్యంలో టీమిండియా తొలి రెండు మ్యాచ్‌లలో ఓడింది.
ఆ రెండు మ్యాచ్‌లలో పంత్ కెప్టెన్సీ వైఫల్యం స్పష్టంగా కన్పించింది. మార్చి మార్చి బౌలింగ్ వేయించడం, సరైన విధంగా బౌలింగ్ ప్లాన్ చేయించకపోవడంతో.. గెలవాల్సిన ఆ రెండు మ్యాచ్‌లలో టీమిండియా ఓటమిపాలయింది. ఇక సిరీస్ నిలవాలంటే తప్పకుండా గెలవాల్సిన మూడో మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా, నాలుగో మ్యాచ్‌లో కూడా విజయ పరంపర కొనసాగించి సిరీస్‌ను సమం చేసింది.
ఇక అయిదో మ్యాచ్ వర్షం వల్ల రద్దవ్వడంతో సిరీస్ 2-2తో సమమైంది. ఇక ఈ సిరీస్లో పంత్ కెప్టెన్‌గా, బ్యాటింగ్ పరంగా విఫలమయ్యాడనే అర్థమవుతోంది. ఇకపోతే పంత్ 5 మ్యాచ్‌లలో ఒక్కసారి కూడా టాస్ గెలవలేకపోయాడు.

ప్రస్తుతం సరైన పర్సన్ కాదు
ఇకపోతే భారతదేశ భవిష్యత్తు కెప్టెన్‌గా ఎదగడానికి రిషబ్ పంత్ బలమైన కంటెండర్ అయినప్పటికీ.. అతనికి ఇంకా చాలా టైం పడుతుందని మాజీ బీసీసీఐ సెలెక్టర్, కోచ్ మదన్ లాల్ అభిప్రాయపడ్డాడు. పంత్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడానికి ప్రస్తుతం సరైన పర్సన్ కాదని కుండబద్ధలు కొట్టాడు. పంత్ తొలుత బ్యాటర్‌గా మెచురిటీ చూపించాల్సిన అవసరం ఉందని, అది అతని కెప్టెన్సీ నైపుణ్యాలను ప్రతిబింబించగలదని అతను పేర్కొన్నాడు.

టీమిండియా కెప్టెన్ అంటే మాటలు కాదు
'నా మట్టుకు అయితే అతడ్ని కెప్టెన్‌గా కావొద్దనే అనుకుంటాను. అతన్ని కెప్టెన్‌గా నేను అస్సలు అనుమతించను. ఎందుకంటే పంత్ లాంటి బ్యాటర్‌కు ఈ బాధ్యత ఇప్పుడు ఇవ్వాల్సింది కాదు. టీమిండియా కెప్టెన్ అంటే మాటలు కాదు. అది చాలా పెద్ద విషయం. అతనో యువకుడు. అతనికి ఇంకా వయస్సుంది. తగినన్ని మ్యాచ్‌లు ఆడగలిగే వీలుంది.
అతను ఎంత ఎక్కువ టైం ఆడితే.. అతను అంత మంచి పరిణతి పొందుతాడు' అని మదన్ లాల్ స్పోర్ట్స్ టాక్‌లో చెప్పాడు. పంత్ కెప్టెన్సీని ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీతో పోల్చి చూస్తే చాలా తక్కువ శ్రేణిలో ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. పంత్ కెప్టెన్సీ రేసులో బలమైన పోటీదారుగా పరిగణించబడటానికి ముందు కనీసం అతనికి రెండేళ్ల సమయం ఇవ్వాలని సూచించాడు.

రెండేళ్లు సరిగ్గా ఆడితే..
'రాబోయే రెండేళ్లలో అతను తన ఆటతీరును వేరే లెవల్‌కు తీసుకెళ్లగలిగితే అతను ఓ మంచి కెప్టెన్ అవ్వగలడని భావించొచ్చు. అతని ఆటతీరు బాధ్యతాయుతంగా మారితే.. సమయానుసారం కెప్టెన్సీలోనూ పరిణతితో వ్యవహరించగలడు. పంత్ ఒక భిన్నమైన స్వభావం కలిగిన ప్లేయర్.. ఎంఎస్ ధోని సైలెంట్ అండ్ కూల్ కెప్టెన్, కెప్టెన్‌గా అతను తన పని తాను చేసుకుపోయేవాడు.
విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటర్. అందువల్ల ఒక్క డిపార్ట్‌మెంట్లో అతను ఎంతో గొప్పగా ఆడాడు. సో అతను కెప్టెన్ అవడంలో అర్థముంది. ఇక పంత్ వీరిద్దరితో పోల్చితే.. అంత గొప్పగా ఏం కన్పించలేదు. అలాగని పంత్ బ్యాటింగ్లో రాణించడం లేదని నేననను. అయితే అతను కొంచెం మెచురిటీతో ఆడగలిగితే ఇంకాస్త బెటర్ అని నా ఫీలింగ్' అని లాల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications