T20 World Cup 2021: ముగ్గురు ఓపెనర్లు..: ఎంఎస్కే ప్రసాద్ డ్రీమ్ టీమ్ ఇదే

ముంబై: విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లీష్ టీమ్‌ను ఢీ కొడుతోంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్‌ను ఆడుతోంది. నాటింగ్ హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజుకు చేరింది. తొలి టెస్ట్‌పై భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్‌లో ఏకంగా 95 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్‌లో 183 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్‌లో వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. నాలుగు రోజు ఆట కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. భారత జట్టు తొలి ఇన్నింగ్‌లో 278 పరుగులకు ఆలౌట్ అయింది.

అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్ కప్..
ఐపీఎల్ 2021 సీజన్ 14వ ఎపిసోడ్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లను ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించబోతోంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. దీనికి అవసరమైన షెడ్యూల్ కూడా వెలువడింది. ఈ మెగా సీజన్ తరువాత.. ఇక అసలు సిసలు బిగ్ టోర్నమెంట్ ప్రారంభమౌతుంది. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ మొదలవుతుంది. అక్టోబర్ 17వ తేదీన అదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో టీ20 ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌ను షెడ్యూల్ చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.

ఎంఎస్కే ప్రసాద్ టీ20 ప్రపంచకప్ డ్రీమ్‌టీమ్..
ఇదిలావుండగా.. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాల్గొనబోయే భారత క్రికెట్ జట్టు డ్రీమ్ టీమ్‌ను ఎంపిక చేశారు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్. తాజాగా ఎంపిక చేసిన జట్టు కూర్పు అనూహ్యంగా కనిపించింది. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లోో ముగ్గురు ఓపెనర్లకు అవకాశాన్ని కల్పించాల్సి ఉంటుందనే సందేశాన్ని ఇచ్చారాయన. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మను కొనసాగిస్తూనే.. పృథ్వీ షాను కూడా తన డ్రీమ్ టీమ్‌లో చోటు కల్పించారు. ముగ్గురు ఓపెనర్లు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు స్పోర్ట్స్ వెబ్‌సైట్ స్పోర్ట్స్‌కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చారు.

టాప్ ఆర్డర్..మిడిల్ ఆర్డర్ బలంగా..
టాప్ ఆర్డర్‌లో కేప్టెన్ విరాట్ కోహ్లీని కంటిన్యూ చేయించాల్సి ఉంటుందని, బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌కు అతను వెన్నెముక కావడం వల్ల ఓపెనర్లలో ఏ ఒక్కరైనా త్వరగా పెవిలియన్ బాట పట్టినా కోహ్లీ అండగా ఉంటాడని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ తరువాత సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్..బ్యాటింగ్ ఆర్డర్‌లో ఉండాలని ఎంఎస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. అవుట్ స్టాండింగ్ ఫామ్‌లో ఉన్న పృథ్వీ షాను కూడా ఈ ఆర్డర్‌లో చేర్చవచ్చని చెప్పాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్‌లల్లో టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ నిర్వహిస్తోన్నందు.. అక్కడి పరిస్థితులకు అతను చక్కగా సరిపోతాడని అన్నాడు.

టీమ్ ఇదే..
విరాట్ కోహ్ (కేప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్/సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా,వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి/యజువేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్. కృనాల్ పాండ్యాను ఆల్‌రౌండర్ల జాబితాలో చేర్చాడు. అలాగే మిస్టరీ బౌలర్ వరుణ్ చక్రవర్తిని కూడా జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుందని ఎంఎస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications