Mashrafe Mortaza: పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా.. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల హిండన్ ఎయిర్‌బేస్‌లో తలదాచుకుంటోన్నారు.
బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ అల్లర్లు కొనసాగుతూనే వస్తోన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో షేక్ హసీనా అక్రమంగా విజయం సాధించారనేది అక్కడి ప్రజల ఆరోపణ. దీనికితోడు ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాల్లో కోటా వ్యవస్థ.. వంటి ఆమె సారథ్యంలోని ఆవామీ లీగ్ ప్రభుత్వ పతనానికి దారితీసింది.

సొంతదేశం నుంచి హెలికాప్టర్‌లో పారిపోయిన షేక్ హసీనా భారత్‌కు చేరుకున్నారు. సోమవారం సాయంత్రం ఆమె తొలుత అగర్తల చేరుకున్నారు. అక్కడి నుంచి సీ-30 రకానికి చెందిన భారత ఆర్మీకి చెందిన రవాణా హెలికాప్టర్ హెర్కులెస్‌లో హిండన్ ఎయిర్‌బేస్‌కు వచ్చారు.
దీని తరువాత బంగ్లాదేశ్‌లో మరింత విధ్వంసకర పరిణామాలు చోటు చేసుకున్నాయి. షేక్ హసీనాకు చెందిన అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో రచ్చరచ్చ చేశారు. సైనిక తిరుగుబాటు నేపథ్యంలో ఆమె నివాసం, పార్లమెంట్ భవనం, ఆవామీ లీగ్ పార్టీ కేంద్ర కార్యాలయాలకు ఎలాంటి రక్షణ అందుబాటులో లేదా సమయంలో.
ఆందోళనకారులు హసీనా నివాసంలోకి చొరబడ్డారు. వీరంగం సృష్టించారు. కిచెన్, బెడ్‌రూమ్‌లోకి వెళ్లారు. వంట వండుకుని మరీ తిన్నారు. బెడ్ మీదే పడుకున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. విలువైన వస్తువులను తమ వెంట పట్టుకెళ్లారు. కర్టెన్లను తగులబెట్టారు. కుర్చీలను విరగ్గొట్టారు.

అక్కడితో ఆగలేదు. ఆవామీ లీగ్ పార్టీకి చెందిన ఎంపీ, బంగ్లాదేశ్ మాజీ కేప్టెన్ ముష్రఫీ మొర్తాజా నివాసాన్ని ధ్వంసం చేశారు. బంగళాను తగులబెట్టారు. మొర్తాజా ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేసిన ఆందోళనకారులు చేతికి అందిన వస్తువులను ఆయన ఇంటిపైకి విసిరారు. విలువైన వస్తువులను చోరీ చేశారు.
క్రికెట్‌లో కొనసాగుతున్న సమయంలోనే మొర్తాజా రాజకీయ అరంగేట్రం చేశాడు. 2018లో ఆవామీ లీగ్‌లో చేరాడు. నరైల్-2 నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అప్పటి ఎన్నికల్లో మొర్తాజాకు మొత్తం 2,71,210 ఓట్లు పోల్ అయ్యాయి. తన ప్రత్యర్థి, జటియా ఒక్యా ఫ్రంట్ అభ్యర్థి ఫరీదుజ్ జమాన్‌ను మట్టి కరిపించారు.
ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఆడిన బంగ్లాదేశ్ జట్టుకు అతనే కేప్టెన్. 117 మ్యాచ్‌లల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు మొర్తాజా. 390 వికెట్లు పడగొట్టాడు. 36 టెస్టులు, 220 వన్డేలు, 54 టీ20 ఇంటర్నేషనల్స్‌లల్లో 2,955 పరుగులు సాధించాడు. కోల్‌కత నైట్‌రైడర్స్ తరఫున ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడాడు. 2009 సీజన్‌లో కేకేఆర్ తరఫున ఒకే ఒక్క మ్యాచ్‌లో కనిపించాడు. అదే అతని చివరి సీజన్ కూడా.