Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ రిటైర్ అవ్వాలని కోరుతున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

Former Australian player asks Virat Kohli to retire if he fails to score a century at the MCG

మెల్‌బౌర్న్‌: ఆస్ట్రేలియాతో తలపడుతోన్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో రాణించాలని ఆస్ట్రేలియా మాజీ ఫేసర్ మిచెల్ జాన్సన్ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ సెంచరీ సాధించలేకపోతే క్రికెట్ నుంచి వైదొలగాలంటూ సెటైర్ వేశాడు. భారత క్రికెటర్లను విమర్శలతో కుంగదీసేందుకు యత్నిస్తున్న మిచెల్ జాన్సన్ ఈ సారి ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయాడు. మెల్‌బౌర్న్ క్రికెట్ గ్రౌండ్ ఓ ఫ్లాట్ రోడ్ లాంటిదంటూ ఫొటోను పోస్టు చేశాడు. దీంతో భారత క్రికెట్ అభిమానుల నుంచి కౌంటర్‌ల దాడి మొదలైంది. మళ్లీ అదే ధోరణిలో కోహ్లీ ఒకవేళ సెంచరీ చేయలేకపోతే అతను రిటైర్ అవ్వాల్సిందేనంటూ సెటైర్ వేశాడు.

దూకుడు లేకుండా కనిపిస్తున్న కోహ్లీ

మిచెల్ జాన్సన్ మీడియాతో మాట్లాడుతూ.. 'కోహ్లీ అసమాన ప్రతిభతో అందరి క్రికెటర్ల కంటే మెరుగ్గా కనిపిస్తున్నాడు. అలాంటి కోహ్లీ ఈ టెస్టులో మాత్రం దూకుడు లేకుండా కనిపిస్తున్నాడు.' అంటూ తీసిపారేశాడు. జాన్సన్‌కు కోహ్లీకి మధ్య 2014/15పర్యటనలో వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 83వ ఓవర్లో కోహ్లీని బంతితో కొట్టేంత పని చేసిన జాన్సన్ త్వరగానే రియలైజ్ అయినా మైదానంలో జరిగిన వివాదం మాత్రం ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది.

జరుగుతున్న టెస్టుల్లో కోహ్లీ 1138

జరుగుతున్న టెస్టుల్లో కోహ్లీ 1138

అదే టెస్టులో కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌లలో 169, 54 పరుగులు చేసి కంగుతినిపించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో మ్యాచ్‌లో కోహ్లీ ముంగిట ఆశగా ఎదురుచూస్తున్న రికార్డులలో ఒకదాన్ని అప్పుడే ఒడిసిపట్టేశాడు. ఒక ఏడాది కాలంలో విదేశీ గడ్డపై ఎక్కువ పరుగులు సాధించిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. ఇలా ఆసీస్‌తో జరుగుతున్న టెస్టుల్లో కోహ్లీ 1138 పరుగులు చేశాడు.

కోహ్లీ అవుట్ అయ్యాడిలా

కోహ్లీ అవుట్ అయ్యాడిలా

మూడో టెస్టులో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ.. 86 పరుగులు సాధించాడు. భారత్‌-ఆస్ట్రేలియా మూడో టెస్టు రెండో రోజు ఆటలో ఓవర్‌ నైట్‌ స్కోరు 215/2తో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను కెప్టెన్‌ కోహ్లి, పుజారాలు భారీ స్కోరు దిశగా నడిపించారు. స్టార్క్‌ వేసిన షార్ట్‌లెంగ్త్‌ ఆఫ్‌సైడ్‌ బంతిని బౌండరీకి తరలిద్దామనుకున్న కోహ్లి థర్డ్‌మాన్‌లో ఉన్న ఆరోన్‌ ఫించ్‌ చేతికి చిక్కాడు.

Story first published: Thursday, December 27, 2018, 16:13 [IST]
Other articles published on Dec 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+