Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన 29వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకుడు. కేఎల్ నారాయణ నిర్మాత. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ కింద ఈ సినిమాను రూపుదిద్దుకోనుంది. విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చారు. ఇప్పటికే స్టోరీ లాక్ అయింది.
ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ- ప్రొడక్షన్ వర్క్ కొనసాగుతున్నాయి. పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ఇది. 80 శాతం మేర షూటింగ్ అమెజాన్ అడవుల్లో తెరకెక్కించబోతున్నట్టు యూనిట్ ఇదివరకే వెల్లడించింది కూడా. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఈ సినిమా కోసం మహేష్ బాబు స్పెషల్‌గా ట్రెయినింగ్ అవుతున్నారు. తన లుక్‌ను పూర్తిగా మార్చుకుంటోన్నాడు. ఎప్పుడూ లేనివిధంగా గడ్డం, పెరిగిన జుట్టుతో మహేష్ బాబు లుక్ ఫ్యాన్స్‌ను కేక పుట్టిస్తోంది. ఇప్పటివరకు మహేష్ బాబు తప్ప మిగిలిన నటీనటులు ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు.
ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న సినిమా కావడం, మహేష్ కాంబోలో రాబోతోండటం దీనిపై హైప్ క్రియేట్ అయింది. ప్రతిష్ఠాత్మకంగా దీన్ని తెరకెక్కించడానికి రాజమౌళి ప్రిపేర్ అవుతున్నారు. నెవర్ బిఫోర్ అనే విధంగా సినిమా ఉండోబోతోన్నట్లు రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
ఇవ్వాళ ఆయన బర్త్‌డే. 49వ సంవత్సరంలో అడుగుపెట్టాడు. అయినప్పటికీ.. ఏ మాత్రం ఆయన ఛరిష్మా చెక్కుచెదరలేదు. పైగా మరింత గ్లామరస్‌గా తయారవుతున్నాడు. పుట్టినరోజు సందర్భంగా మురారి రీ రిలీజ్ ఏ స్థాయిలో రచ్చ చేసిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. థియేటర్లల్లో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
బర్త్‌డే సందర్భంగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మహేష్ బాబుకు విషెస్ చెప్పాడు. జిమ్‌లో ఆయన వర్కవుట్ చేస్తోన్న ఓ ఫొటోను తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. హ్యాపీ బర్త్‌డే లెజెండ్ అనే కామెంట్స్ యాడ్ చేశాడు. దీనిపై వందల సంఖ్యలో రిప్లైలు పోస్ట్ అయ్యాయి.