T20 World Cup 2022: అది అవమానకరం.. వెస్టిండీస్ ఓటమిపై రికీ పాంటింగ్..

టీ20 ప్రపంచకప్ నుంచి వెస్టిండీస్ ముందుగానే నిష్క్రమించడం 'అవమానకరం' అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. జట్టులో తగినంత ప్రతిభ ఉన్నప్పటికీ ICC ఈవెంట్‌లకు ఆటగాళ్ల నిబద్ధతను పాంటింగ్ ప్రశ్నించారు. వెస్టిండీస్ తమ తొలి గేమ్‌లో స్కాట్లాండ్ చేతిలో ఓడిపోయింది. అయితే సూపర్ 12 క్వాలిఫై ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి జింబాబ్వేను ఓడించింది. కీలక మ్యాచ్ లో ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది.

పోస్ట్‌మార్టం
వెస్టిండీస్ సూపర్ 12 దశకు కూడా చేరకపోవడం ఆశ్చర్యకరమైన ఫలితమని పాటింగ్ నొక్కి చెప్పాడు. "నాకు సంబంధించినంత వరకు ఇది అవమానకరం. ఇది నిజంగా వారి క్రికెట్‌కు చాలా చెడ్డది. ఆ జట్టులో ప్రతిభను కలిగిన వారు ఉన్నారు" అని చెప్పాడు. వెస్టిండీస్ ఓటమిపై క్షుణ్ణంగా పోస్ట్‌మార్టం నిర్వహించాలని సూచించాడు. "నేను ఇక్కడ చెప్పడం చాలా సులభం, కానీ వారు ఎవరినైనా ఓడగొడతారు, వారు కొంత ఆత్మ పరిశీలన చేసుకోవాలని" అని అన్నాడు.

బ్యాటర్లు
శుక్రవారం జరిగిన కీలకమైన మ్యాచ్ లో ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిన కరేబియన్లు ఇంటి ముఖం పట్టారు. ఈ వెస్టిండీస్ పై ఐర్లాండ్ వికెట్ల తేడాతో గెలుపొంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ కింగ్, చార్లెస్, ఒడియన్ స్మీత్ రాణించడంతో వెస్టిండీస్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. మ్యాచ్ అధ్యంతం ఐర్లాండ్ బౌలర్లను ఎదుర్కొవడంలో కరేబియాన్ ఆటగాళ్లు విఫలమ్యయారు. బంతిని బౌండరీ తరలించడంతో విఫలమయ్యారు.

బ్రాండన్ కింగ్
వెస్టిండీస్ ఆటగాళ్లలో బ్రాండన్ కింగ్ 48 బంతుల్లో ఒక సిక్స్, 6 ఫోర్లతో 62 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. జన్సన్ చార్లెస్ 18 బంతుల్లో సిక్స్, 3 ఫోర్లతో 24 పరుగులు చేయగా ఒడియన్ స్మీత్ 19 పరుగలు చేశాడు. మిగతా వారు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో గారెత్ డెలానీ 4 ఓవర్లలో 16 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.సిమి సింగ్, బారీ మెక్‌కార్తీ ఒక్కో వికెట్ తీశారు.

పాల్ స్టిర్లింగ్
147 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ ఓపెనర్లు అలవోకగా కరేబియన్ బౌలర్లను ఎదుర్కొంటు బౌండరీలు తరలించారు. ఐర్లాండ్ 17 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. పాల్ స్టిర్లింగ్ 48 బంతుల్లో 2 సిక్స్ లు, 6 ఫోర్లతో 66 పరుగులతో అజేయంగా నిలువగా.. వికెట్ కీపర్ లోర్కాన్ టక్కర్ 35 బంతుల్లో 2 సిక్స్ లు, 2 ఫోర్లతో 44 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ 23 బంతుల్లో 3 సిక్స్ లు, 3 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. అకెల్ హుస్సేన్ ఒక వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications