Alan Thomson: వన్డే చరిత్రలో తొలి వికట్ తీసిన అలాన్ థామ్సన్ ఇకలేరు..

ODI చరిత్రలో మొదటి వికెట్ తీసిన ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ అలాన్ థామ్సన్(76) మరణించాడు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం మృతి చెందాడు. ఈ విషయాన్ని అతని సోదరుడు ట్విటర్ ద్వారా తెలిపాడు. "మా అన్నయ్య, మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ అలాన్ థామ్సన్ మరణించాడని వివరించాడు. కాగా థామ్సన్ కు కొద్ది రోజుల క్రితం ఆపరేషన్ జరిగింది. థామ్సన్ 1970-71 ఏడు టెస్టుల యాషెస్ సిరీస్‌లో నాలుగు టెస్టులు ఆడాడు.
ఫ్రాగీ
నాలుగు టెస్టుల్లో 12 వికెట్లు అలాన్ సాధించారు. అతని బౌలింగ్ యాక‌్షన్ కూడా అందరికంటే ఉండేదట. అందుకే అతనిని ముద్దుగా "ఫ్రాగీ" అని పిలుచుకోనేవారని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది. ఆయన ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో విక్టోరియా తరుఫున ఆడారు. గ్రెగ్ చాపెల్, డెన్నిస్ లిల్లీతో కలిసి ఆస్ట్రేలియా B జట్టుతో కలిసి న్యూజిలాండ్‌లో పర్యటించాడు. థామ్సన్ 44 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 184 వికెట్లు తీశాడు.

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య 1971 జనవరి 5న MCGలో ప్రపంచంలోని మొదటి వన్డే జరిగింది. ఈ వన్డేలో థామ్సన్ మొదటి వికెట్‌ను తీశాడు. ప్రపంచంలోనే మొదటి వన్డేలో మొదటి వికెట్ తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 8 ఓవర్లు బౌలింగ్ చేసిన థామ్సన్ 22 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications