టీ20 కలల జట్టులో ధోనీకి చోటు.. కోహ్లీకి మొండిచేయి

మెల్‌బోర్న్: ఇటీవలి కాలంలో మాజీ క్రికెటర్లు తమ కలల జట్టును ప్రకటించడం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తన డ్రీమ్ జట్టును ప్రకటిస్తున్నారు. ప్రపంచకప్-2019 సమయంలో చాలా మంది మాజీలు తమ తమ దేశ జట్లను ప్రకటించారు. ప్రపంచకప్ అనంతరం కూడా ప్రకటించారు. తాజాగా ఆసీస్ మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జోన్స్ కూడా ఈ జాబితాలో చేరిపోయారు.

కోహ్లీకి దక్కని చోటు:
తాజాగా డీన్ జోన్స్ తమ కలల టీ20 జట్టును ప్రకటించాడు. భారత్ నుంచి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ఎంపిక చేసాడు. పరుగుల మెషీన్ విరాట్ కోహ్లీకి మాత్రం జోన్స్ తన కలల జట్టులో చోటు ఇవ్వలేదు. ఎందరో మాజీలను ఎంచుకున్న జోన్స్.. భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ పేర్లను మరచిపోయాడు. అయితే ఈ జట్టులో అసలు టీ20 ఫార్మాట్‌తో పరిచయం లేని దిగ్గజ క్రికెటర్లకు అవకాశం కల్పించడం విశేషం. గోర్డాన్ గ్రీనిడ్జ్, వివ్ రిచర్డ్స్, మార్టిన్ క్రో, ఇయాన్ బోథమ్, ఆంబ్రోస్, జోయల్ గార్నర్‌లు ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు.

షేన్ వార్న్ ఒక్కడే:
ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్‌తో పాటు విండీస్ మాజీ ఓపెనర్ గోర్డన్ గ్రీనిడ్జ్‌లను జోన్స్ ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. మూడో స్థానంలో వివ్ రిచర్డ్స్‌కు అవకాశం ఇచ్చాడు. బ్రియాన్ లారా, ఎంఎస్ ధోనీ, మార్టిన్ క్రోలను మిడిల్ ఆర్డర్‌లో ఎంపిక చేసుకున్నాడు. షేన్ వార్న్, వసీం అక్రమ్, ఆంబ్రోస్, జోయల్ గార్నర్‌లు బౌలర్లుగా తీసుకున్నాడు. స్పిన్ విభాగంలో కేవలం షేన్ వార్న్‌ను మాత్రమే ఎంచుకున్నాడు.
ఆస్పత్రి నుంచే పోస్టు.. రెండోసారి సర్జరీ చేయించుకోవడం చాలా కష్టం

జోన్స్ టీ20 జట్టు:
మాథ్యూ హేడెన్, గ్రీనిడ్జ్, వివ్ రిచర్డ్స్, బ్రియాన్ లారా, మార్టిన్ క్రో, ఇయాన్ బోథమ్, ఎంఎస్ ధోని, షేన్ వార్న్, వసీం అక్రమ్, ఆంబ్రోస్, జోయల్ గార్నర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications