Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మాజీ వికెట్ కీపర్ లోర్నా బీల్ మృతి!!

Former Australia woman wicketkeeper Lorna Beal passes away

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్, విక్టోరియన్ మహిళా క్రికెటర్ లోర్నా బీల్ కన్నుమూశారు. ఆమె వయసు 96 సంవత్సరాలు. లోర్నా బీల్ సోమవారం (ఆగస్టు 10, 2020) మృతి చెందినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఓ ప్రకటనలో తెలిపింది. ఆమె మృతికి క్రికెట్ ఆస్ట్రేలియా సంతాపం తెలిపింది. బీల్ కుటుంబ సభ్యులకు ఆసీస్ ఆటగాళ్లు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ఆస్ట్రేలియా తరఫున ఏడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన లోర్నా బీల్.. న్యూజిలాండ్‌తో 1948లో వెల్లింగ్టన్‌లో జరిగిన మొదటి మహిళల టెస్ట్ మ్యాచులో అరంగేట్రం చేశారు. బీల్ 1923లో మెల్బోర్న్ లోని హౌథ్రోన్‌లో జన్మించారు. కుడిచేతి వాటం బ్యాటింగ్, వికెట్ కీపర్ అయిన బీల్.. సౌత్ హౌథ్రోన్ లేడీస్ క్రికెట్ క్లబ్‌లో చేరడానికి ముందు 12 ఏండ్ల వయసులో క్రికెట్‌ను చేపట్టారు. ఆ తరువాత హౌథ్రోన్ లేడీస్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించారు.

1951లో ఇంగ్లండ్ పర్యటనలో ఆసీస్ తరఫున ఆరు టెస్టులు ఆడిన లోర్నా బీల్.. 1951 పర్యటన తరువాత క్రికెట్ ఆటకు గుడ్ బై చెప్పారు. ఆమె ఏడు సంవత్సరాలు నేషనల్ లేడీస్ గోల్ఫ్ యూనియన్ కౌన్సిల్ సభ్యురాలుగా, బాక్స్ హిల్ గోల్ఫ్ క్లబ్ కెప్టెన్‌గా సేవలందించారు. పయనీర్ విక్టోరియన్ లేడీస్ క్రికెట్ అసోసియేషన్ సభ్యురాలుగా కూడా ఉన్నారు. లోర్నా బీల్ మరణం ఆస్ట్రేలియాలోని బడ్డింగ్ క్రికెటర్లకు తీరని లోటని, ఆమె చూపిన బాటలో ఎందరో మహిళా క్రికెటర్లు రాటుదేలారని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హాక్లే నివాళులర్పించారు.

Story first published: Tuesday, August 11, 2020, 19:49 [IST]
Other articles published on Aug 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+