Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మ్యాన్ హంట్: రెండు గంటల పాటు కారులో: గర్ల్‌ఫ్రెండ్‌తో డేటింగ్: మాజీ లెజెండరీ స్పిన్నర్ కిడ్నాప్

former Australia cricketer Stuart MacGill Kidnapped, Released Hour Later

సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెటర్, స్పిన్ బౌలర్ స్టువర్ట్ మెక్‌గిల్‌ను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రెండు గంటల పాటు కారులో తిప్పారు. గుర్తు తెలియని ప్రదేశానికి అతణ్ని తీసుకెళ్లి చితకబాదారు. గన్ పాయింట్ కింద అతణ్ని బెదిరించారు. రెండు వారాల కిందట సిడ్నీలో చోటు చేసుకున్న ఈ ఘటన.. నిందితుల అరెస్ట్‌తో వెలుగులోకి వచ్చింది. ఈ నలుగురు నిందితుల్లో ఒకడు.. మెక్‌గిల్ గర్ల్‌ఫ్రెండ్ సోదరుడే. అతనే ఈ కిడ్నాప్ ఎపిసోడ్‌కు కింగ్‌పిన్‌గా పోలీసులు నిర్ధారించారు.

క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత స్టువర్ట్ మెక్‌గిల్ న్యూట్రల్ బే ఏరియాలోని అరిస్టాటిల్స్ రెస్టారెంట్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తోన్నాడు. ఆ రెస్టారెంట్ ఓనర్ మారినో సొటిరోపౌలోస్‌తో అతనికి మంచి సంబంధాలు ఉన్నాయి. మారినో చెల్లెలితో మెక్‌గిల్‌కు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. కొద్దిరోజుల పాటు మూడోకంటికి తెలియకుండా డేటింగ్‌లో గడిపారు. ఈ విషయం మారినోకు తెలియడంతో మెక్‌గిల్ కిడ్నాప్‌కు ప్లాన్ చేశాడు.

దీనికోసం నలుగురు వ్యక్తులకు సుపారీ ఇచ్చాడు. కిందటి నెల 14వ తేదీన రాత్రి 8 గంటలకు మెక్‌గిల్‌ను నిందితులు అపహరించారు. సిడ్నీ సౌత్ వెస్ట్‌లోని బ్రింగెల్లిలో తన ఇంటికి వెళ్తోన్న మెక్‌గిల్ కారులో కిడ్నాప్ చేశారు. రెండు గంటల పాటు అతనికి నరకయాతన పెట్టారు. కారులో తిప్పుతూ చితగ్గొట్టారు. సిడ్నీ శివార్లలోకి తీసుకెళ్లి తుపాకులతో బెదిరించారు. అక్కడే వదిలేసి, పారిపోయారు. దీనిపై అతను సిడ్నీ సిటీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మ్యాన్ హంట్ ప్రారంభించారు. మూడు వారాల తరువాత నిందితులను అరెస్ట్ చేశారు. మిన్హ్ ఎన్‌గుయెన్, ఫ్రెడ్రిక్, రిచర్డ్ స్కార్ఫ్ సహా మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ కిడ్నాప్ వెనుక మారినో ఉన్నట్లు నిర్ధారించారు. ఆరు రోజుల తరువాత స్టువర్ట్ మెక్‌గిల్ తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. అందుకే నిందితులను అరెస్ట్ చేయడంలో ఆలస్యమైందని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు చెప్పారు.

Story first published: Wednesday, May 5, 2021, 12:49 [IST]
Other articles published on May 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+