Ricky Ponting: షేన్ వార్న్‌ను తలచుకుని కన్నీటి పర్యంతమైన రికీ పాంటింగ్

మార్చిన 4న హఠాన్మరణం చెందిన స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌న్‌తో తనకున్న అనుబంధాన్ని తలచుకుని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ రోజు ఉదయం నిద్ర లేచాక తన పిల్లలను నెట్ సెషన్‌కు తీసుకెళ్లడానికి తాను సిద్ధమవుతండగా షేన్ వార్న్ మరణ వార్త గురించి తన భార్య రియానా తనతో చెప్పినట్లు పేర్కొన్నాడు.
మొబైల్‌లో వచ్చిన వార్తలను చూసి రియానా తనతో షేన్ వార్న్ మరణ వార్తను తెలిపిందని, అది విని తాను వెంటనే తన భార్య చేతిలో నుంచి మొబైల్ లాక్కుని చూశానని ఆయన తెలిపాడు. షేన్ వార్న్ మరణ వార్తను తాను నమ్మలేకపోయానని పాంటింగ్ చెప్పాడు. తాను షాక్‌కు గురయ్యానని, ఇప్పటికీ కూడా షేన్ వార్న్ మరణ వార్తను తాను జీర్ణించుకోలేక పోతున్నానని తెలిపాడు.
తన సహచరుడు, స్నేహితుడైనా షేన్ వార్న్ ఈ లోకంలో లేడనే వార్తను తాను నమ్మలేకపోతున్నానంటూ ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రికీ పాంటింగ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకు 15 ఏళ్ల వయస్సున్నప్పుడు షేన్ వార్న్‌ను తొలి సారి ఓ క్రికెట్ అకాడమీలో కలిశానని చెప్పాడు. ఆ సమయంలో వార్న్ తనకు ఓ నిక్ నేమ్ కూడా పెట్టినట్లు పాంటింగ్ గుర్తు చేసుకున్నాడు.
దశాబ్దకాలంపాటు ఆస్ట్రేలియాకు ఇద్దరం కలిసి ఆడామని, కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశామని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా షేన్ వార్న్‌కు రికీ పాంటింగ్ నివాళులు కూడా అర్పించాడు. కాగా 2000 సంవత్సరం నుంచి రికీ పాంటింగ్ కెప్టెన్సీలో షేన్ వార్న్ ఆడాడు.
52 ఏళ్ల షేన్ వార్న్ థాయిలాండ్‌లోని ఓ విల్లాలో గుండెపోటుతో మరణించాడు. దీంతో క్రీడా లోకం ఒక్క సారిగా దిగ్భ్రాంతికి లోనయింది. 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో షేన్ వార్న్ ఎన్నో రికార్డులను అందుకున్నాడు. అలాగే ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అలాగే మొత్తంగా రెండో బౌలర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో షేన్ వార్న్‌లో టెస్టుల్లో 708, వన్డేల్లో 291 వికెట్లు తీశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి వెయ్యికిపైగా వికెట్లు తీశాడు. ఈ క్రమంలో షేన్ వార్న్ తన స్పిన్ మాయ జాలంతో బ్యాటర్లను ఉక్కిరి బిక్కిరి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications