IND vs BAN: ఎవరి కోసం ఆ ఫ్లయింగ్ కిస్?.. తన మనసులోని మాట బయటపెట్టిన షమీ
IND vs BAN: స్టార్ బౌలర్ మహ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో తన తొలి మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. బంగ్లాదేశ్ పై భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ గురువారం దుబాయ్ లో జరిగింది. భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ 10 ఓవర్లలో 53 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. షమీ బంగ్లాదేశ్ కు చెందిన చాలా మంది ముఖ్యమైన బ్యాటర్లను పెవిలియన్ కు పంపాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జట్టు 49.4 ఓవర్లలో 228 పరుగులకే కుప్పకూలింది. శుభ్‌మన్ గిల్ అజేయ సెంచరీతో రాణించడంతో భారత్ 46.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది.
దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సౌమ్య సర్కార్(0), మెహదీ హసన్ మిరాజ్(5), జకీర్ అలీ(68), తంజిమ్ హసన్ సాకిబ్(0), తస్కిన్ అహ్మద్(3)లను ఔట్ చేశాడు. మహ్మద్ షమీ మాట్లాడుతూ.. ఈ వేడుక 2017లో మరణించిన తన తండ్రికి అంకితం అని చెప్పాడు. ఈ ఫ్లయింగ్ కిస్ తన తండ్రి కోసం ఎందుకంటే ఆయనే నా ఆదర్శమని.. ఎప్పుడూ తనతోనే ఉంటారని షమీ తన తండ్రి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేశాడు.

టోర్నమెంట్ కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ షమీకి పూర్తి మద్దతు ఇచ్చాడు. షమీ జట్టులోకి తిరిగి రావడం అవసరమని రోహిత్ చెప్పుకొచ్చాడు. దీనిపై షమీ మాట్లాడుతూ.. కెప్టెన్ అయినా, కోచ్ అయినా, ఈ మద్దతు ప్రతి ఆటగాడికి చాలా ముఖ్యమని అన్నాడు. ఎందుకంటే ఇంత పెద్ద టోర్నమెంట్ కోసం మనల్ని విశ్వసించే ఆటగాళ్లు ఉంటే.. అది కెప్టెన్, జట్టుకు మనశ్శాంతిని ఇస్తుందన్నారు. తనకు ఏ బాధ్యతను ఇచ్చినా.. దానిని నెరవేర్చగలనా అని ఎల్లప్పుడూ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తానన్నాడు. ఐసీసీ ఈవెంట్లలో రికార్డుల గురించి మాట్లాడుతూ.. అలాంటి రికార్డులు ప్రతి ఒక్కరి జీవితంలోనూ రావాలన్నాడు.
భారత జట్టు తదుపరి మ్యాచ్ ఆదివారం దుబాయ్ లో పాకిస్థాన్ తో జరగనుంది. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో షమీ భారత బౌలింగ్ విభాగాన్ని నడిపిస్తున్నాడు. మహ్మద్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి తిరిగి రావడం టీమ్ కు భారీ ప్రోత్సాహాన్నిచ్చింది.
Shami said "That flying kiss was for my father, he is my role model". [Sahil Malhotra from TOI] pic.twitter.com/Ttp1FtmqKz
— Johns. (@CricCrazyJohns) February 20, 2025
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications