Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో వన్డేలో ఆ ఇద్దరికి కోహ్లీ సూపర్ సర్‌ప్రైజ్.. జీవితాంతం గుర్తుండిపోయేలా!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి వయసుతో సంబంధం లేకుండా.. చిన్న పిల్లాల నుంచి పెద్దవారి వరకు అభిమానులు ఉంటారన్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ ను కలిసినప్పుడు విరాట్.. వారితో ఎంతో ఆప్యాయంగా ప్రవర్తిస్తుంటాడు. ముఖ్యంగా చిన్న పిల్లల్ని కలిసినప్పుడు .. ఒకటి తానైనా చిన్నపిల్లాడిలా మారిపోతాడు.. లేదంటే వారి ముఖాల్లో చిరునవ్వును తెప్పించేందుకు ప్రయత్నిస్తాడు. తాజాగా ఇంగ్లాండ్ తో ముగిసిన రెండో వన్డేలోనూ ఇదే చేశాడు కోహ్లీ. ఈ మ్యాచ్ లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేసిన విరాట్.. అక్కడే ఉన్న ఇద్దరు పిల్లలకు ఎప్పటికీ మర్చిపోలేని ఓ మధుర జ్ఞాపకాన్ని అందించాడు.

విరాట్ ఏం చేశాడంటే?
కటక్‌ వేదికగా జరిగిన రెండో మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేశాడు. అదే సమయంలో ఇద్దరు బాల్ బాయ్స్ కూడా అక్కడే ఉన్నారు. ఆ ఇద్దరు.. విరాట్ తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో కోహ్లీ కూడా వారి దగ్గరికి వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించాడు. విరాట్ చర్యతో పిల్లల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వగానే రెండో పిల్లాడు అయితే.. జీవితంలో గొప్ప విజయాన్ని సాధించినట్టుగా ప్రతిస్పందించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఫ్యాన్స్ దీన్ని తెగ షేర్ చేస్తున్నారు.

For Virat Kohlis shakeHand Ball Boys Reaction goes viral in 2nd ODI against england Cuttack

కోహ్లీ మళ్లీ నిరాశే..
ఈ మ్యాచ్ లో కోహ్లీ మళ్లీ నిరాశ పరచాడు. 8 బంతుల్లో 62.52 స్ట్రైక్ రేట్ తో 5 పరుగులు చేసిన అతడు.. ఓ ఫోర్ బాదాడు. ఈ పోరులో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. దీంతో మూడు మ్యాచుల ఈ సిరీస్ లో 2-0 తేడాతో ఆధిక్యంలో దూసుకెళ్లింది భారత జట్టు.

Story first published: Monday, February 10, 2025, 8:30 [IST]
Other articles published on Feb 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+