For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ నిర్వహణ లోపానికి బీసీసీఐకు రూ.121 కోట్ల జరిమానా

For the IPL, many people, including BCCI, were fined Rs 121 crore!

హైదరాబాద్: కేసు పాతదే.. అయినా తీర్పు కొత్తది. నియమ నిబంధనలను అతిక్రమిస్తే ఎవరికైనా క్రమశిక్షణా చర్యలు తప్పవు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2009 సందర్భంగా ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు బీసీసీఐ, బోర్డు మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌, ఐపీఎల్‌ మాజీ కమిషనర్‌ లలిత్‌ మోదీ, ఇతరులకు ఈడీ రూ.121 కోట్ల జరిమానా విధించింది.

బీసీసీఐ 2009లో దక్షిణాఫ్రికాలో ఐపీఎల్‌ను నిర్వహించింది. నిర్వహణ కోసం రూ.243 కోట్లను బయటి దేశానికి బదిలీ చేసే క్రమంలో విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) అతిక్రమణ జరిగిందన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. బీసీసీఐపై రూ.82.66 కోట్ల జరిమానా వేసింది. శ్రీనివాసన్‌కు రూ.11.53 కోట్లు, లలిత్‌ మోదీకి రూ.10.65 కోట్లు, బోర్డు మాజీ కోశాధికారి పాండవ్‌కు రూ. 9.72 కోట్లు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌ (ఎస్‌బీఐతో విలీనమైంది)కు రూ.7 కోట్లను జరిమానాగా విధించింది.

వ్యక్తులకు విధించినది.. బోర్డు చెల్లించాల్సిన మొత్తం కలిపి రూ.121.56 కోట్ల జరిమానా విధించినట్లుగా ఈడీ అధికారులు తెలిపారు. ఆటగాళ్లు క్రమశిక్షణా చర్యలు ఉల్లంఘించినా నియమాలు పాటించకపోయినా వాళ్లపై నిషేదాన్ని, జరిమానాను విధించే బోర్డు తెలిసీ ఎందుకు తప్పు చేసిందో. ఇంకా పూర్తి వివరాల్సి ఉంది.

2009వ సంవత్సరం దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ నిర్వహించడం సంబంధించి భారీ మొత్తంలో నగదు చెల్లించాల్సి రావడంతో.. వచ్చిన లాభాల కంటే ఇచ్చే జరిమానానే ఎక్కువగా ఉంది. అయితే ఈ జరిమానాను 45రోజుల్లోగా చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేయటం గమనార్హం.

Story first published: Friday, June 1, 2018, 9:15 [IST]
Other articles published on Jun 1, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+