For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాకు మాత్రం బెస్ట్ ఇండియన్ బ్యాట్స్ మెన్ అంటే సచినే: కోట్ని వాల్స్

By Nageswara Rao
Courtney Walsh
కింగ్‌స్టన్(జమైకా): ఇండియన్ బ్యాటింగ్ ఐకాన్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ని ఆరాధించే వారిలో మరో క్రొత్త వ్యక్తి చేరాడు. ఎవరా క్రొత్త వ్యక్తి అని అనుకుంటున్నారా.. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ కోట్ని వాల్స్. కోట్ని వాల్స్ మాట్లాడుతూ నాకు మాత్రం సచిన్ టెండూల్కర్ నెంబర్ వన్ బ్యాట్స్ మెన్. చాలా సందర్బాలలో సచిన్ నా బౌలింగ్‌లో ఛాలెంజింగ్‌గా ఆడడం, ఇంకోన్ని సందర్బాలలో ఇద్దరం చాలా కాంపిటేటివ్‌గా తీసుకోవడం జరిగింది. ఎప్పుడైనా సచిన్ వికెట్ గనుక తీసుకుంటే ఇరువైపుల నుండి కూడా సద్బావమైన వాతావరణం కనిపించేదని తన మనసులోని మాటలను వెల్లడించారు. ఇది మాత్రమే కాకుండా తనకు క్రికెట్‌లో ఎవరైనా స్పూర్తి ప్రదాతలు ఉన్నారంటే అది కేవలం సచినేనని తెలిపారు.

కొట్ని వాల్స్ తన జీవితంలో 132 టెస్టు మ్యాచ్‌‌లు ఆడి 519 వికెట్లు తీసుకోని ప్రపంచంలో కెల్లా ఎక్కువ వికెట్లు తీసుకున్న టాప్ బౌలర్స్‌లలో ఐదవ టాప్ బౌలర్‌గా రికార్డు నెలకోల్పారు. ఒక్కసారి ఈ రికార్డు పరంపరను చూస్తే టెస్టులలో ఎక్కవ వికెట్లు తీసుకున్న వారిలో మొట్టమొదటి స్దానంలో ముత్తయ్య మురళీధరన్(800 వికెట్లు), షేన్ వార్న్(708 వికెట్లు), అనిల్ కుంబ్లే(619 వికెట్లు), గ్లెన్ మెక్ గ్రాత్(563 వికెట్లు) తర్వాత స్దానంలో కోట్ని వాల్స్ ఉన్నారు. సోమవారం వెస్టిండీస్‌తో ఇండియా మొట్టమొదటి టెస్టులో తలపడుతున్న సమయంలో కోట్నివాల్స్ ఈ విషయాన్ని సబీనా పార్క్ వద్ద వెల్లడించారు.

కోట్ని వాల్స్ తన జీవితంలో మోడ్రన్ క్రికెట్‌ని ఎంతగానో ఆస్వాదించారు. గతంలో ఉన్న వెస్టిండీస్ టీమ్‌కి ఇప్పటి టీమ్‌కి చాలా మార్పులు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు ఉన్న టీమ్ కుర్రాళ్శలలో ఏకాగ్రత, కాన్పిడెన్స్ లోపించాయని అన్నారు. ఫాస్ట్ బౌలర్స్ విషయంలో కొంత వరకు పోటన్షియల్ ఉన్నప్పటికీ జట్టు, మిగతా విషయాలలో కొంత వెనకబడి ఉందని అన్నారు. నేను వెస్టిండీస్ టీమ్ నుండి చాలా తొందరగా రిటైర్ మెంట్ ప్రకటించానని అనుకుంటున్నాను. అందుకు కారణం యంగ్ స్టర్స్‌కి బ్రేక్ ఇవ్వడం కోసమే అలా చేశానని సమర్దించుకున్నారు.

ఇక 90లలో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్స్ అయినటువంటి కోట్ని వాల్స్, కుర్ట్లీ ఆంబ్రోస్‌‌ను చూసి ప్రంపంచం మొత్తం ఒక అడుగు వెనక్కి వేసిందనే చెప్పాలి. మేము ఇద్దరం కూడా ఒకరికొకరి సూచనలు, సలహాలు పంచుకుంటూ ప్రత్యర్దులపై చెలరేగి పోయేవారమని అన్నారు. మా ఇద్దరి స్టయిల్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉండేవని అన్నారు. టీమ్‌కి ఏది కావాలో అది సాధించి పెట్టడంలో మేము ఉండేవారమని ఆరోజులను నెమరవేసుకున్నారు. నాకు తెలిసి నేను ఇంతవరకు స్లెడ్జింగ్ చేయలేదు. ఎందుకంటే అది గేమ్ స్పిరిట్‌ని దెబ్బతీస్తుందని అన్నారు. నా విషయంలో మాత్రం బాలే సమాధానం చెబుతుందని అన్నారు.

ఇక వాల్స్ తర్వాత తన స్దానాన్ని భర్తీ చేయడానికి జమైకా నుండి మరో ఫాస్ట్ బౌలర్ వెస్టిండీస్ టీమ్‌కి లభించాడు. అతనే మైఖెల్ హోల్డింగ్. మైఖెల్ హోల్డింగ్ బౌలింగ్‌ని అతను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. చాలా బాగుంటుందని అన్నారు. ఆ తర్వాతి కాలంలో మేమిద్దరం ఒకే క్లబ్‌కి ఆడడం కూడా జరిగిందని కోట్నివాల్స్ తన అనుభవాలను పంచుకున్నారు. ఇది ఇలా ఉండగా రెండు రోజుల క్రితం మిస్టర్‌ డిపెండెబుల్‌, ది వాల్‌ గా పేరుగాంచిన రాహుల్‌ ద్రావిడ్‌ తనకు ఇప్పటికీ స్ఫూర్తినిస్తున్నది ఎవరో తెలుసా? తనతో కలిసి 19 టెస్ట్‌ సెంచరీల్లో పాలుపంచుకున్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ తనకు స్ఫూ ర్తి అని తెలిపిన సంగతి తెలిసిందే.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+