Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హెల్మెట్ ధరించిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు (వీడియో)

For first time ever, cricket sees a helmet-wearing bowler

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ హెల్మెట్ ధరించడాన్ని ఇప్పటివరకు మనం చూశాం. అంతేకాదు డేంజర్‌ జోన్‌లో ఫీల్డింగ్‌ చేసే ఫీల్డర్లు సైతం​ హెల్మెట్‌లను ధరించడం మనం చూశాం. అయితే ఓ బౌలర్ హెల్మెట్ ధరించి బౌలింగ్ చేసిన సంఘటన మాత్రం న్యూజిలాండ్‌ దేశవాళీ టీ20 మ్యాచ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే... న్యూజిలాండ్ సీమర్ వారెన్ బార్నెస్ తలకు హెల్మెట్‌కు ధరించి బౌలింగ్‌ చేశాడు. దీంతో తలకు హెల్మెట్ ధరించి బౌలింగ్ చేసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. హమిల్టన్‌ వేదికగా సెడాన్‌ పార్క్‌లో ఒటాగో-నార్తరన్ నైట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది.

ఈ మ్యాచ్‌లో నార్తరన్ నైట్స్ పేసర్ నీల్ వాగ్నర్‌ బౌలింగ్ వేస్తున్న సమయంలో బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి నేరుగా వచ్చి అతడి కాలును తాకింది. దీంతో అతడు బాధతో కాసేపు మైదానంలోనే విలవిల్లాడాడు. అదే బంతి తలను తాకి ఉంటే అతడి ప్రాణానికే ప్రమాదం అని వారెన్ భావించాడు కోబోలు.

ఇంకేముంది తాను బౌలింగ్ వేస్తున్నప్పుడు బేస్‌బాల్ అంపైర్ ధరించే హెల్మెట్‌ను పెట్టుకుని మరీ బౌలింగ్ వేశాడు. దీంతో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు అతడిని కాస్త వింతగా చూశారు. అయితే మ్యాచ్ అనంతరం తాను హెల్మెట్ ధరించడాన్ని వారెన్ సమర్థించుకున్నాడు.

బౌలింగ్ చేసేటప్పుడు తన తల నేరుగా బ్యాట్స్‌మెన్‌ వైపే ఉంటుందని, కాబట్టి బ్యాట్స్‌మెన్ కొట్టే బంతి తలకు తాకే అవకాశం ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారెన్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో హెల్మెట్ ధరించి 3 ఓవర్లు వేసిన వారెన్ 33 పరుగులు సమర్పించుకున్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 25, 2017, 11:58 [IST]
Other articles published on Dec 25, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+