కీలక నిర్ణయం: ఇకపై క్రికెట్‌లో 'రెడ్‌కార్డ్' సస్పెన్షన్
హైదరాబాద్: త్వరలో క్రికెట్‌లో పలు విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ముఖ్యంగా క్రికెట్‌లో బంతికి, బ్యాట్‌కు మధ్య సమతుల్యం తేచ్చేందుకు మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కొన్ని పరిమితులను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా రెడ్ కార్డ్ సస్పెన్షన్, బ్యాట్ సైజ్ కుదింపులాంటి విప్లవాత్మక మార్పులను ప్రపంచ క్రికెట్ కమిటీకి సూచించింది.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ బ్రియర్లీ మైక్ బియర్లే నేతృత్వంలో రెండు రోజుల పాటు సమావేశమైన ఈ కమిటీ పలు అంశాలపై చర్చించింది. ఇందులో మైదానంలో ఆటగాళ్లు హింసాత్మకంగా ప్రవర్తిస్తే 'రెడ్ కార్డ్' సస్పెన్షన్ వేటు వేయాలని సిఫారసు చేసింది. ఈ తరహా వేటు ప్రస్తుతం ఫుట్‌బాల్-హాకీ తరహాలో ప్లేయర్లకు మాత్రమే ఉంది.
టెస్టు మ్యాచ్‌ను నాలుగు రోజులకు కుదించడంపైనా ఈ కమిటీ చర్చించింది. అయితే చివరకు ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. ఇందులో భాగంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను ప్రవేశపెట్టడంపై అడుగులు వేయాలని కూడా ఎంసీసీ సూచించింది. ఈ కమిటీ భేటీలో మాజీ ఆటగాళ్లు రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), రమీజ్ రాజా (పాకిస్తాన్), జాన్ స్టీఫెన్సన్ (ఎంసీసీ చీఫ్) పాల్గొన్నారు.

2017 అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు
ఇక ఎంసీసీ విషయానికి వస్తే క్రికెట్‌లో నిబంధనలను రూపొందించడం దీని బాధ్యత. ఈ కమిటీ చేసిన ప్రతిపాదనలను ఎంసీసీ ప్రధాన కమిటీకి పంపుతారు. అక్కడ అమోదం పొందితే ‘లా ఆఫ్ క్రికెట్'లో కొత్త కోడ్ 2017 అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం మైదానంలో ఆటగాడు తీవ్ర స్థాయిలో క్రమశిక్షణను ఉల్లంఘించినప్పుడు అతన్ని మ్యాచ్ నుంచి పంపే అధికారం అంపైర్లకు ఉంటుంది.

బ్యాట్ సైజు కుదింపు
కాగా, బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి ఫీల్డర్ హెల్మెట్‌కు తగిలి క్యాచ్ పడితే ప్రస్తుతం నాటౌట్‌గా ఇస్తున్నారు. ఇకపై దానిని ఔట్‌గా పరిగణించాలని కమిటీ ప్రతిపాదించింది. బ్యాట్ సైజ్‌పై పాంటింగ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న బ్యాట్‌ను కుదించేందుకు 60 శాతం ఆటగాళ్లు మద్దతిస్తున్నారని అన్నారు. బ్యాట్ బ్లేడ్ సైజ్ 40 మిల్లీమీటర్లు మించకుండా చూడాలని ప్రతిపాదించారు. ఒలింపిక్స్ తదితర క్రీడల్లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడాన్ని బీసీసీఐ వ్యతిరేకిస్తూ వచ్చింది.

సచిన్ సూచనను తిరస్కరించిన ఎంసీసీ సభ్యులు
దీంతో అందరిని సంతృప్తి పరిచాకే తుదినిర్ణయం తీసుకోవాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. రంజీల్లో రెండు పిచ్‌లపై మ్యాచ్‌లు నిర్వహించాలన్న సచిన్ సూచనను ఎంసీసీ సానుకూలంగా స్పందించలేదు. ‘‘ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పోటీతత్వం ఉండాలి. రెండు రకాల పిచ్‌లను ఉపయోగిస్తే ఫస్ల్‌క్లాస్ క్రికెట్ ప్రాధాన్యాన్ని తగ్గిపోతుంది. ఇది ఎంసీసీ క్రికెట్ కమిటీ అభిప్రాయం'' అని పాకిస్థాన్ క్రికెటర్ రమీజ్ రజా చెప్పాడు.

ఎంసీసీ కమిటీ సభ్యులు వీరే:
మైక్ బియర్లే (చైర్మన్)
జాన్ స్టీఫెన్సన్ (క్రికెట్ ఎంసిసి హెడ్)
జిమ్మీ ఆడమ్స్
షార్లెట్ ఎడ్వర్డ్స్
సౌరవ్ గంగూలీ
రాడ్ మార్ష్
టిమ్ మే
బ్రెండన్ మెక్‌కల్లమ్
రికీ పాంటింగ్
రమీజ్ రాజా
కుమార సంగక్కర
విన్స్ వాన్ డెర్ బిజిల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications