Champions Trophy: డెలివరీ బాయ్స్‌గా టీమిండియా క్రికెటర్స్.. మొదలైన కొత్త గొడవ!
ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత జరగనున్న ఈ ప్రతిష్టాత్మక మెగా టోర్నీలో విజయం సాధించి ట్రోఫీని ముద్దాడలని టీమిండియా పట్టుదలతో ఉంది. అయితే ఈ నేపథ్యంలో టీమిండియాను డెలివరీ బాయ్స్ గా అభివర్ణిస్తూ ఓ ఫుడ్ డెలివరీ సంస్థ చేసిన ప్రమోషన్ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనిని పలువురు వ్యతిరేకిస్తూ సదరు సంస్థపై మండిపడుతున్నారు.
అసలేం జరిగిందంటే?
magicpin అనే ఫుడ్ డెలివరీ యాప్.. టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ చేసిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాశంమైంది. ఏఐో జనరేటెడ్ చేసిన పిక్ లో ఓ వైపు టీమిండియా, మరోవైపు తమ సంస్థకు చెందిన డెలివరీ బాయ్స్.. డెలివరీకి సిద్ధంగా ఉన్నారంటూ అని అర్థం వచ్చేలా పోస్ట్ డిజైన్ చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఈజ్ ఆన్ అంటూ.. తమ వాళ్లు డెలివరీకి సిద్ధంగా ఉన్నారని, మెన్ ఇన్ బ్లూ మీరు డెలివరీకి సిద్ధంగా ఉన్నారా అని దానిపై రాసుకొచ్చింది.
ఈ పోస్ట్ చూసిన క్రికెట్ అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాను డెలివరీ బాయ్స్ తో పోలుస్తూ, అభివర్ణిస్తూ ఇలా పోస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు.. సదరు ఫుడ్ డెలివరీ సంస్థ క్రికెట్ పరిభాషలో సిక్స్ లు, ఫోర్లు డెలివరీ చేస్తారా, ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ కు డెలివరీ చేస్తారా అన్నట్టుగా రాసుకొచ్చిందని ఇంకొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications