నసీమ్ షా రాణించేనా? U-19 వరల్డ్‌కప్ కోసం ఏరికోరి తెచ్చుకుంటున్నాడు

హైదరాబాద్: ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో అరంగేట్రం చేసిన 17 ఏళ్ల యువ పేసర్ నసీమ్ షా వచ్చే ఏడాది జనవరి నుంచి దక్షిణాఫ్రికా వేదికగా జరిగే అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో పాకిస్థాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ మేరకు పాక్ అండర్-19 హెడ్ కోచ్ ఇజాజ్ అహ్మద్ పేర్కొన్నాడు.
వచ్చే ఏడాది జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకు అండర్-19 వరల్డ్‌కప్ టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో అండర్-19 హెడ్ కోచ్ ఇజాజ్ అహ్మద్ మాట్లాడుతూ "అతడు(నసీమ్ షా) నా ప్రధాన ఆయుధం. వరల్డ్‌కప్ జట్టులో అతడు తప్పక ఉండాలి" అని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోకి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు.

అంతర్జాతీయ క్రికెట్‌ను రుచి చూసిన షా
"అతను ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌ని రుచి చూశాడు. శ్రీలంకతో సొంతగడ్డపై జరిగే టెస్ట్ సిరీస్‌లో ఆడతాడు. మేము ప్రధానంగా స్పిన్నర్లకు మద్దతుగా నిలుస్తున్నాం. పరిస్థితులను బట్టి మహ్మద్ అబ్బాస్, షాహీన్ అఫ్రిదిలు ఫాస్ట్ బౌలింగ్‌కు నాయకత్వం వహిస్తారు" అని కోచ్ ఇజాజ్ అహ్మద్ వెల్లడించాడు.

న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లాంటి వేదికల్లో
"న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లాంటి వేదికల్లో అవసరమైనప్పుడు నసీమ్ షాను ఉపయోగించాలని నేను భావిస్తున్నాను. దక్షిణాఫ్రికా వేదికగా వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో అతడి అవసరం మాకుంది. అందుకే నేను అతడిని విడుదల చేయమని మిస్బా (ఉల్-హక్, చీఫ్ కోచ్ మరియు సెలెక్టర్)ని అడుగుతాను" అని అన్నాడు.

అరంగేట్రంలోనే అరుదైన రికార్డు
ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో నసీమ్ షా తన అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడిగా నసీమ్ షా నిలిచాడు. మొత్తంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన తొమ్మిదవ పిన్న వయస్కుడిగా నిలిచాడు.

ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ క్రెయిగ్ రికార్డు బద్దలు
దీంతో ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ క్రెయిగ్ పేరిట ఉన్న రికార్డుని బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ క్రెయిగ్ పేరిట ఉంది. 1953లో ఇయాన్ క్రెయిగ్ దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో 17 ఏళ్ల వయసులో అరంగేట్రం చేశాడు.

ఆరు దశాబ్దాల తర్వాత
ఆరు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై పిన్న వయసులో టెస్టు అరంగేట్రం చేసిన రికార్డుని నసీమ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా గడ్డపై రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను పాకిస్థాన్ 2-0తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఫలితంగా వరుసగా 14 టెస్టుల్లో ఓటమిపాలైన జట్టుగా పాక్ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications